ఎరక్కపోయి… ఇరుక్కుపోయి

నౌపడ నుంచి టెక్కలి వైపు వెళ్తున్న

కిటికి డోర్‌లో ఇరుక్కున ప్రయాణికుడి తల

  • ఆర్‌టిసి కిటికీలో ఇరుక్కున్న ప్రయాణికుడు

ఆర్‌టిసి బస్సు కిటికీలో ఓ ప్రయాణికుడు తల ఇరుక్కుపోయింది. ఉమ్ము ఊయడానికి ప్రయత్నించే క్రమంలో ముందకు వెళ్లలేక, వెనక్కి రాలేక మధ్యస్తంగా నలిగిపోయాడు. స్థానికులు, తోటి ప్రయాణికులు చొరవ చూపి అతి కష్టంమీద 15 నిముషాల పాటు కష్టపడి ఇరుక్కుపోయిన తలను బయటకు తీశారు. ఆ సమయంలో ప్రయాణికులు టెన్షన్‌కు గురయ్యారు. ఈ ఘటన బుధవారం టెక్కలిలో చోటు చేసుకుంది.

ప్రజాశక్తి- టెక్కలి రూరల్‌

నౌపడ నుంచి టెక్కలి వైపు వెళ్తున్న ఆర్‌టిసి పల్లె వెలుగు సంతబొమ్మాళి మండలం సుందరరావు ఆర్‌టిసి బస్సు ఎక్కాడు. టెక్కలి ఇందిరాగాంధీ విగ్రహం కూడలి వద్ద ఉమ్ము బయటకు ఊయడానికి సైడు డోర్‌ నుంచి తలను బయటకిపెట్టాడు. తిరిగి వెనక్కి వస్తున్న క్రమంలో ఆ మధ్యలో తల ఇరుక్కుపోయింది. సుందరరావు ఎంత ప్రయత్నించినా తల బస్సులోపల వైపుకి రాకపోవడంతో షాక్‌ గురయ్యాడు. ఈ విషయాన్ని తోటి ప్రయాణికులు గమనించి కండక్టర్‌, డ్రైవర్‌కు సమాచారం అందజేశారు. అందరూ కలిసి అతడికి సహాయం చేసేందుకు 15 నిముషాలు చర్యలు చేపట్టారు. అయినా తల బయటకు రాలేదు. చివరకు కిటికీకి ఉన్న రేకును స్థానికులు వంచి తలను బయటకు వచ్చేలా చేశారు. దీంతో ఆ ప్రయాణికుడు ఊపిరిపీల్చుకున్నాడు. ఈ 15 నిముషాలు టెన్షన్‌కు గురయ్యాయని ప్రయాణికుడు సుందరరావు తెలిపారు. బస్సుల్లో ప్రయాణాలు చేసే ప్రయాణికులు సైడు డోర్‌ నుంచి తలను బయటకు పెట్టి కోరి కష్టాలు తెచ్చువద్దని చెప్పడానికి ఇదో హెచ్చరిక.

 

➡️