ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వైఎస్‌ఆర్‌ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి 16వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తూనే ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాలను ముట్టడించారు. ఒంటికాలిపై, చెవులు మూసుకుని, చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలు మాత్రం సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ప్రజాశక్తి – కడప అర్బన్‌ అంగన్‌వాడీకు సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయమంటే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని, ఇలాంటి తాటాకు చప్పళ్లకు అదరం..బెదరమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్‌ స్పష్టం చేశారు. బుధవారం సమ్మెలో భాగంగా సిఐటియు కార్యాలయం నుంచి ర్యాలీగా డిప్యూటీ సిఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. క్యాంపు గెటు ఎదుట నిరసన చేట్టారు. అంగన్‌వాడీలు తమ గోడు వినిపించుకునేందుకు డిప్యూటీ సిఎం క్యాంపు కార్యాలయాని వస్తే ఆయన అందుబాటులో లేరు. అంగన్‌వాడీలు క్యాంపు కార్యాలయం ఎదుట ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డుపై బైటాయించారు. ఆందోళన విషయం డిప్యూటీ సిఎం దృష్టికి అధికారులు తీసుకువెళ్లినా ఆయన అంగన్‌వాడీల గోడు వినేందుకు రాలేదు. దీంతో గంటన్నర పాటు ఆందోళన చేసిన అంగన్‌వాడీలు చివరకు డిప్యూటీ సిఎం పిఎకి వినతి పత్రం అందజేసి వెనుదిరిగారు. నిరసనలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మిదేవి, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం.ఓబులేసు ప్రసంగించారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు మాట్లాడారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకుల ఎం.పి.అంజనీదేవి, వినీల, నాగలక్ష్మి, పద్మ, సంటేమ్మ, స్వర్ణ, కృష్ణవేణి పాల్గొన్నారు. జమ్మలమడుగు: పట్టణంలోని ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి కార్యాలయాన్ని అంగన్వాడీలు సిఐటియు నాయకులతో కలిసి ముట్టడించారు. కార్యక్రమంలో యూనియన్‌ జమ్మలమడుగు ప్రాజెక్ట్‌ అధ్యక్ష, కార్యదర్శులు భాగ్యమ్మ, లక్ష్మీదేవి, సిఐటియు పట్టణ కార్యదర్శి దాసరి విజయ, సిపిఎం పట్టణ కార్యదర్శి ఏసుదాసు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి వినరు కుమార్‌, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు నరసమ్మ, దస్తగిరమ్మ, కార్యకర్తలు, ఆయాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మైదుకూరు: పట్టణంలోని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కార్యాలయాన్ని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కార్యాలయంలో లేకపోవడంతో కాసేపు కార్యాలయం వద్ద బేటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా మాజీ కార్యదర్శి శివకుమార్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అంగన్వాడీ శిబి రాన్ని సందర్శించి అంగన్వాడీ కార్యకర్తల నుంచి వినతిపత్రం తీసుకోవాలని, లేని పక్షంలో ఎమ్మెల్యే ఎక్కడ ఉంటే అక్కడకి వెళ్లి తమ నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి షరిఫ్‌, సిఐటియు నాయకులు జహింగిర్‌ భాష, అంగన్వాడీ నాయకులు ధనలక్ష్మి, చెన్నమ్మ, భారతి, శోభ, రామ తులసి పాల్గొన్నారు. వేంపల్లె : అంగన్వాడీ మహిళాలు తమ పిల్లలను తీసుకొని స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చెవులు మూసుకొని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు సరస్వతి, లలితా, సావిత్రి, శైలజాలు పేర్కొన్నారు. వేంపల్లె, వేముల, చక్రాయపేట మండలాల అంగన్వాడీ మహిళాలు పాల్గొన్నారు. పులివెందుల టౌన్‌ : సమస్యలను పరిశీలించాలని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఒంటి కాలిపై చేతులు జోడించి మొక్కుతూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు(పుట్టపర్తి సర్కిల్‌) : ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ ఇంటిముందు బైఠాయించి సిఐటియు జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంట నే తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఎమ్మెల్యే రాచమల్లుకు వినతిపత్రం సమ ర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు చీర-సారే పంచిన కుటుంబం తమదని, రిటైర్మెంట్‌ నాడు రూ.50 వేలు రూ.రెండు లక్షలు అంగన్వాడీలకు చెల్లించాలని డిమాండ్‌ చేసిన వ్యక్తి తానని పేర్కొన్నారు. అంగన్వాడీలకు వస్తున్న జీతభత్యాలు సరిపోవు అనటం తన వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొంటూ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం పేదలను ఆర్థికంగా అభివద్ధి పరచడమేనని తెలిపారు. చాపాడు : తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణలో సామరస్యంగా నిరసన దీక్ష చేపడుతున్న అంగన్వాడీలు రోజుకు ఒక వినూత్న పద్ధతిలో దీక్షను కొనసాగిస్తున్నారు. మడూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీలు సుజాత, కార్యకర్తలు పాల్గొన్నారు. కొండాపురం: తమ సమస్యలు పరిష్కరించండంటూ అంగన్వాడీలు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని చుట్టుముట్టారు. ప్రభుత్వం ప్రజలందరికీ అండగా ఉందని చెప్తున్నారనీ, అంగన్వాడీల విషయంలో న్యాయం చేయడం లేదంటూ వాపోయారు. సమస్యలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ అందరి సంక్షేమంతో పాటు అంగన్వాడీల సంక్షేమం కూడా కచ్చితంగా చేపడతామని చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా సరిగా లేకపోవడంతో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడానికి, వేతనాలు పెంచడానికి మరికొంత సమయం కావాలని కోరారు. అంగన్వాడీలకు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి భూపేష్‌రెడ్డి మద్దతు తెలియజేశారు. అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పోరుమామిళ్ల : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కొనసాగుతోంది. కార్యక్రమంలో సిఐ టియు జిల్లా ఉపాధ్యక్షులు భైరవప్రసాద్‌, నాయకులు చిన్నయ్య, ఓబులాపురం విజయమ్మ, వినోద, మేరి, దస్తగిరిమ్మ, జ్యోతిమ్మ, రేణుకమ్మ, రమాదేవి, లక్ష్మీదేవి, అంజనమ్మ, సుధా, స్వాతి పాల్గొన్నారు. దువ్వూరు : సమస్యలు పరిష్క రించాలని కోరుతూ జమ్మలమడుగు ఆర్‌డిఒ శ్రీనివాసులుకు అంగన్వాడీలు వినతిపత్రం సమర్పించారు. బద్వేలు : అంగన్వాడీలు సిడిపిఒ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే ఇంటి వరకు ర్యాలీ నిర్వ హించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద బైఠా యించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ శ్రీనివాసులు, నాయకులు కొండయ్య, ఓబులేసు, రాజగోపాల్‌, కదిరయ్య, చిన్ని, ఆదిల్‌, సురేంద్ర, ఇమా న్యుల్‌, గిలి రాయప్ప, అనంతమ్మ, రత్నమ్మ, గౌతమి, మొక్షమ్మ, బాలమ్మ, నాగమ్మ, సుభాషిని, ఉషానమ్మ, విజయమ్మ, శోభాదేవి, సుభద్ర, జయప్రదమ్మ, రాధమ్మ, రత్నమ్మ, తులసమ్మ, కళావతి, సుభాషిని, వాణి, వసంత, సరోజనమ్మ పాల్గొన్నారు. ఎర్రగుంట్ల : అంగన్వాడీలు నిడుజివ్విలోని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్యే ఇంటి ఎదుట తమ నిరసన తెలియజేశారు. ఎమ్మెల్యేకు,ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగ న్వాడీల సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు ఆపమన్నారు. ఎమ్మెల్యే లేకపోవడంతో ఆయన ఎంపిపి లక్ష్మీదేవికి వినతిపత్రాన్ని అందించారు.

➡️