ఎమ్మెల్యే అనుచరుల నుండి ప్రాణహాని

 ఎంపి విజయసాయిరెడ్డికి అధికార పార్టీకి చెందిన వ్యక్తి వీడియో సందేశం 

పల్నాడు జిల్లా:  ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అను చరుల నుండి ప్రాణహాని ఉందని, హతమార్చేందుకు రెక్కీ నిర్వహించడమే కాకుండా ఇంటి పరిసరాల్లోకి వచ్చి దుర్భాషలాడుతున్నారని అధికార పార్టీకి చెందిన గునపాటి వెంకటేశ్వరరెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి పంపిన సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో బుధవారం హల్‌చల్‌ చేసింది. దీనిపై బాధితుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ 2015 లో రావిపాడు గ్రామ పంచాయతి పరిధిలో 41 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశానని, దాని పక్కనే ఉన్న మరో 41 సెంట్ల స్థలాన్ని ఎమ్మెల్యే అనుచరులు నరస రావుపేట మండలంలోని బసికాపురం గ్రామానికి చెందిన వంపుగుడి జాన్‌, మరికొందరు కొనుగోలు చేశారని చెప్పారు. అయితే, తన 41 సెంట్ల స్థలాన్ని కూడా మార్కెట్‌ ధరకు కాకుండా వారు నిర్ణయించిన తక్కువ ధరకే విక్రయించాలని తనపై ఒత్తిడి చేశారని అన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యేను సంప్రదించగా మార్కెట్‌ ధరకు సంబంధం లేకుండా ప్రక్క స్థలం కంటే కొంత మొత్తం అదనంగా చెల్లిస్తారని, విక్ర యించాలని చెప్పారన్నారు. తాను ఒప్పుకొకపోవడంతో ఎమ్మెల్యే మాటను ధిక్కరిస్తావా అంటూ జాన్‌, మరి కొందరు తనను బెదిరించారని, హతమార్చేందుకు రెక్కీ నిర్వహించారని భయపడి ఇంటి నుండి బయటకు రావడం లేదని మీడియా ఎదుట కన్నీటి పర్యంత మయ్యారు. ఇటీవల ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాన్ని తాడేపల్లికి పిలిచి ఎమ్మెల్యే వలన ఏమైనా సమస్యలు ఉంటే తనకు చెప్పాలన్న ఎంపి విజయసాయిరెడ్డి సూచన మేరకు అక్రమార్కులకు ఎమ్మెల్యే అండగా ఉన్నారని చెప్పానని, ఇది మనసులో పెట్టుకొని జాన్‌ , స్థలంలో ఫెన్సింగ్‌ తొలగించి దున్నారన్నారు. వేరే స్థలానికి సంబంధించిన వివాద ం నేపథ్యంలో రూ 23 లక్షలు ఎమ్మెల్యే వద్ద ఉన్నాయని, అవి ఇవ్వడం లేదని అన్నారు. పార్టీకి విరాళంగా రూ.3.50 లక్షలు ఇచ్చానని చెప్పారు.ఒకే సామాజిక వర్గం అయినప్పటికీ సొంత పార్టీ వారు ఎటువంటి సహాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ఫీ వీడియోపై పలువురు విలేకరులు ఎమ్మెల్యేని వివరణ కోరగా స్థల వివాదం పంచాయితి తన దగ్గరకు వచ్చిందని, ఇరు వర్గాలతో మాట్లాడినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని వారికి సూచించానని అన్నారు. తనపై అసత్య ప్రచారాలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు.

➡️