ఎన్నికలకు అధికారుల సన్నద్ధం

Feb 13,2024 23:47
రాబోయే సాధా రణ ఎన్నికలను ప్రశాంతంగా,

ప్రజాశక్తి – కాకినాడ

రాబోయే సాధా రణ ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్‌ డాక్ట ర్‌ కృతికా శుక్లా ఎన్నికల అధి కారులను ఆదేశించారు. మంగ ళవారం కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ సివి ప్రవీణ్‌ ఆదిత్యతో కలిసి ఎన్నికల ఆర్‌ఒలు, ఇఆర్‌ ఒలు, నోడల్‌ అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గ దర్శకాలు క్షుణ్ణంగా చదవి అవగాహన చేసుకుని, విశ్వాసం పెంపొందించుకుని అందరూ ఖచ్చితంగా పాటిం చాలన్నారు. ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన విధులను సజావుగా నిర్వర్తించాలన్నారు. ఇందు కోసం కావలసిన పరికరాలు సామాగ్రిని సమకూ ర్చుకోవాలన్నారు. జిల్లాలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారికి వివిధ అంశాల్లో సహకారం అందించడానికి 19 మంది సీనియర్‌ అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించడం జరిగిందని ఆమె తెలిపారు. తాజాగా ఎన్నికల సంఘం అనేక సూచనలు జారీ చేస్తుందన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ డి.తిప్పే నాయక్‌, ఆర్‌డిఒ ఇట్ల కిషోర్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ జే.వెంకట్రావు, సిపిఒ పి.త్రినాథ్‌, డిఆర్‌డిఒ పీడీ కె.శ్రీరమణి, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, జిల్లా పౌర సంబంధాల అధికారి డి.నాగార్జున, పలువురు ఎఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️