ఉపాధ్యాయుల చేతుల్లోనే సమాజ భవిష్యత్తు

Feb 27,2024 23:32

సత్కారం పొందిన ఉపాధ్యాయులతో ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు
ప్రజాశక్తి – క్రోసూరు :
యుటిఎఫ్‌ స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని కెవిఆర్‌ అండ్‌ జయలకీë ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో క్రోసూరు, అచ్చంపేట మండలాల పరిధిలోని ఉత్తమ ఉపాధ్యాయులకు స్థానిక జై భారత్‌ పబ్లిక్‌ స్కూల్లో మంగళవారం ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ సమాజం బాగుపడాలన్న, రేపటి తరాలు బాగుండాలన్న ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. అంత కీలకమైన ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు తన తల్లిదండ్రుల పేరు మీదుగా అవార్డులను ప్రదానం చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే నంబూరి శంకరరావు మాట్లాడుతూ అవార్డు పొందిన ఉపాధ్యాయులకు మరింత బాధ్యత పెరిగిందని, వారు ఉత్సాహంతో పని చేయాలని చెప్పారు. అనంతరం ఎంఇఒ వై.ప్రసాదరావు మాట్లాడారు. యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌, జి.విజయసారధి, నాయకులు బి.నరసింహారెడ్డి, కె.ప్రకాశరావు, జి.లూకా, షేక్‌ ఖాజావలి, కె.శ్రీనివాసరావు, ఎ.వెంకటేశ్వరరావు, షేక్‌ మహబూబ్‌ బాషా, టి.శౌర్రెడ్డి పాల్గొన్నారు.ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు స్థానిక సెయింట్‌ ఆన్స్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ను సందర్శించారు. పాఠశాల నిర్వహణ తీరును గమనించి హెచ్‌ఎం సిస్టర్‌ మేరీ రజితను అభినందించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడారు. కాళ్లు, చేతులు లేకున్నా పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత స్థాయికి ఎదగొచ్చని, అందుకు సమకాలీన ఉదాహరణ నిక్‌ వుజిక్‌ అని అన్నారు. ఆయన్ను ప్రేరణగా తీసుకుని లక్ష్యాలను చేరుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో శౌరెడ్డి, బాలశౌరెడ్డి, గోవింద్‌రెడ్డి, లక్ష్మణ్‌, ప్రకాష్‌ విజరు, బురాన్‌ పాల్గొన్నారు.

➡️