ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.

Jan 3,2024 21:59
సన్మానిస్తున్న దృశ్యం

సన్మానిస్తున్న దృశ్యం
ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.
.ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యాదాత, ప్రముఖ పారిశ్రామిక వేత్త నాయుడు ఆదికేశవుల రెడ్డి సూచించారు. స్థానిక హైస్కూల్‌లో బుధవారం నాయుడు నాగేశ్వరమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌, ఎన్‌టిఆర్‌ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ నాయుడు ఆదికేశవుల రెడ్డి ఆధ్వర్యంలో ఈ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదికేశవుల రెడ్డి మాట్లాడుతూ హైస్కూల్‌తో పాటు, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రత్యేకంగా కషి చేస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి గవర్నమెంట్‌ జూనియర్‌ కళాశాలకు ఎన్‌డిఆర్‌ గవర్నమెంట్‌ జూనియర్‌ కళాశాల పేరు వచ్చిందని తెలియజేశారు.పాఠశాలలో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేస్తానని ఆదికేశవుల రెడ్డి చెప్పారు. ఈ పాఠశాల విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. తదనంతరం పిల్లలకు నిర్వహించిన పరీక్షలో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు జామెంట్రీ బాక్స్‌లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులను సత్కరించారు. అనంతరం తన తండ్రి దశరధరామిరెడ్డి పేరుపై ఉన్న ఎన్‌డిఆర్‌ జూనియర్‌ కళాశాలలో ఆదికేశవుల రెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో నాయుడు వెంకట నర్సారెడ్డి, పాఠశాల హెడ్మాస్టర్‌ రియాజ్‌ అహ్మద్‌, కళాశాల ప్రిన్సిపల్‌ ధనుంజయ, కళాశాల లెక్చరర్లు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ నాగరాజు, ఇంగిలాల బాలకష్ణ, పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంచారు.

➡️