ఉద్యమం.. ఉధృతం

Dec 14,2023 00:06
ఉద్యమం.. ఉధృతం

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: అపరిస్కతంగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా సిఐటియుసి, ఏఐటీయూసీ, ఐఎఫ్‌ఎస్సి నేతత్వంలో చేపట్టిన సమ్మె బుధవారానికి రెండో రోజుకు చేరుకుంది. జిల్లావ్యాప్తంగా అంగన్వాడీలు పెద్దసంఖ్యలో సమ్మెలో పాలొ ్గన్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు సిడిపిఓ కార్యాలయం, యాదమరి మండ లం తహశీల్దార్‌ కార్యాలయాలు ఎదుట అంగన్వాడీలు మోకాళ్లపై నిలబడి ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. న్యాయమైన తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చే అంతవరకు సమ్మె కొనసాగుతుందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి షకీలా స్పష్టం చేశారు. జిల్లాలోని దాదాపు అన్ని ప్రాజెక్టులలో అంగన్వాడీలు రెండవ రోజు సమ్మెలో పాల్గొన్నారు. కుప్పం, శాంతిపురం, వీకోట, పుంగనూరు, పలమనేరు, జీడీ నెల్లూరు, బంగారుపాలెం, ఐరాల, పాలసముద్రం, కార్వేటి నగరం లాంటి ప్రాంతాల్లో అంగన్వాడీలు సమ్మె విజ యవంతం చేశారు. కుప్పం, వీకోట, శాంతిపురం, పుంగనూరు ప్రాంతాల్లో జరిగిన అంగన్వాడీల నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు వాడ గంగరాజు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంగన్వాడీల నిరసనలు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చైతన్య, సురేంద్ర పాల్గొని సంఘీభావం తెలిపారు.నేటి నుండి సమ్మె ఉధృతంసిఐటియు, ఏఐటీయూసీ, ఐఎఫ్టియు అంగన్వాడీ యూనియన్ల సంయుక్త పిలుపుమేరకు గురువారం నుండి అంగన్వాడీలు సమ్మెను ఉధతం చేయనున్నారు. 14,15వ తేదీల్లో ట్రేడ్‌ యూనియన్లు, రాజకీయ పార్టీల సంఘీభావం 16వ తేదీ కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకొని మోకాళ్ళపై నిలబడి నిరసన, 17 ప్రీస్కూల్‌ పిల్లలు, గర్భవతులు, బాలింతలతో అంగన్వాడీలకు సంఘీభావం తెలుపుతూ నిరసన, 18వ తేదీ మానవహారాలు, 19వ తేదీ రాస్తారోకోలు, 20వ తేది వంటావార్పు, 21వ తేదీ భిక్షాటన, 22వ తేదీ రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు.గంగవరం: పలమనేరు పట్టణంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు జాతీయ మానవ హక్కులు, అవినీతి నిర్మూలన సంస్థ సభ్యులు బుధవారం సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంస్ద జిల్లా నాయకులు డివి మునిరత్నం, వేలయుధం, పార్థసారథి, మనీ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఎన్నో ఏళ్ల నుండి ఐసిడిఎస్‌ను కాపాడుకోవడానికి అహర్నిశలు కషి చేశారని అలాంటివారికి కనీసవేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వాలు మొండిగా వ్యవహరించడమే కాకుండా వారిని శ్రమ దోపిడికి గురి చేస్తూ హక్కులను హరించడమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంబించడం వలన కార్మికులు హక్కుల కోసం వీధి పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రవికుమార్‌, సోము, సుబ్రహ్మణ్యం, శ్యామల, బాలాజీ, ఆనంద, లక్ష్మమ్మ పాల్గొన్నారు.వెదురుకుప్పం: కార్వేటినగరం మండల కార్యాలయం ప్రాంగణంలో అంన్వాడీల చేపట్టిన నిరవధిక సమ్మె రెండవ రోజు కొనసాగింది. జనసేన నియోజకవర్గం ఇంచార్జ్‌ పొన్న యుగంధర్‌ కార్యకర్తల తో కలిసి దీక్షా శిబిరానికి చేరుకుని వారికి మద్దతు తెలిపారు. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం స్పందించి వెంటనే చట్టబద్ధంగా అమలు చేయాలని కోరారు. గంగాధర నెల్లూరు: గంగాధరనెల్లూరు, పెనుమూరు మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్‌ యాదవ్‌, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు వెంకటేష్‌, మండల టిడిపి అధ్యక్షుడు స్వామిదాస్‌, పార్లమెంట్‌ టిడిపి ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి దేవసుందరం, జిల్లా యాదవ సాధికార మహిళా అధ్యక్షురాలు గాయత్రి యాదవ్‌లతో పాటు పలువురు టిడిపి నేతలు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. యూనియన్‌ నేతలు గోవిందమ్మ, వాణి, బాను, మాధవి, నదియా, గీత, హంసవేణి, పవన, అరుణ పాల్గొన్నారు.పుంగనూరు: అంగన్వాడీలు న్యాయమైన కోర్కెల సాధన కోసం చేస్తున్న నిరసనలకు బీసీవై పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు పార్టీ చీప్‌ బోడె రామచంద్ర యాదవ్‌ చెప్పారు. ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద రెండో రోజు నిరవధిక సమ్మె బుధవారం నిర్వహించారు. పుంగనూరులో ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలకు భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధ్యక్షుడు బొడె రామచంద్ర యాదవ్‌ మద్దతు తెలిపారు. ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు సిఐటియు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు న్యాయమైన కోరికలు తీర్చకుండా వారిని వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తున్నట్లు అనిపించారు. వెంటనే ప్రభుత్వ స్పందించి వారి న్యాయమైన కోర్కెలను తీర్చడానికి డిమాండ్‌ చేశారు.యాదమరి: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మెలో భాగంగా బుధవారం రెండవ రోజు మండల కేంద్రమైన యాదమరి తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వా డీలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా టీడీపీ మండల అధ్యక్షులు మొరార్జీ, ప్రధాన కార్యదర్శి రబ్బి మహిళ అధ్య క్షురాలు చిత్ర, అధికార ప్రతినిధి వల్లే రమ్మన్నాద నాయుడు, తెలుగు యువత అధ్యక్షుడు గుణశేఖర్‌, కమలనాథన్‌ గజేంద్ర మద్దతు తెలిపారు. కుప్పం: ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కుప్పంలో ప్రాజెక్టులో రెండవరోజు సమ్మె ప్రారంభించారు. ఈసందర్భంగా ఏపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు, యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కెపి.లలితలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను ఎలా భగం చేయాలని అధికారులతో ఒత్తిడి చేస్తున్నదే తప్ప సమస్యలు ఎలా పరిష్కారం చేద్దామనే ఆలోచనలో లేకపోవడం దుర్మార్గమన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. సిఐటియు జిల్లా నాయకులు బాలసుబ్రమణ్యం, ప్రాజెక్టు నాయకులు సరళ, కస్తూరి, ఐఎఫ్టియు మహాలక్ష్మీ పాల్గొన్నారు.బంగారుపాళ్యం: అంగన్వాడీల సమ్మెకు తెలుగుదేశం ఇంచార్జ్‌ పూతలపట్టు నియోజకవర్గం ఇంచార్జ్‌ మురళీమోహన్‌ మద్దతు తెలిపారు. అలాగే యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి సరిత, టిడిపి మండల అధ్యక్షులు మొగిలయ్య, ప్రధాన కార్యదర్శి మోహన్‌ రెడ్డి, లోకనాథం నాయుడు, జనార్దన్‌ గౌడ్‌, శివ కమల్‌నాథ్‌ రెడ్డి, సుదర్శన నాయుడు మద్దతు తెలిపారు.

➡️