ఇంటర్‌ ఫలితాల్లో పురోగతి తథ్యం

ఫలితాల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలేమిటి? ఇంటర్‌ ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక కసరత్తు చేయడమైంది. ఇంటర్‌బోర్డు రాష్ట్రవ్యాప్తంగా అందించిన జయీభవ ప్లానింగ్‌ను పకడ్బందీగా అమలు చేశాం. దీనికితోడు ఈఏడాది నాలుగు యూనిట్‌ పరీక్షలు క్వార్టర్లీ, హాఫ్‌ఇయర్లీ, ప్రీఫైనల్‌ వంటి ప్రయోగాలను నిశితంగా పరిశీ లించాం. సంస్థాగత పరీక్షల ఫలితాల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేకంగా దృష్టి సారిం చడమైంది.ఫలితాల్లో వెనుకబాటుతనానికి కారణాలేమిటి? టెన్త్‌కు, ఇంటర్‌ పరీక్షా విధానానికి వ్యత్యాసం ఉంటోంది. ఇంటర్‌ పరీక్షల్లో డిస్ట్రిక్టివ్‌ విధానం ఉంటుంది. ఇంటర్‌ ఫలితాల్లో వెనుకబాటుతనానికి ప్రధాన కారణం క్రీమ్‌ (తెలివైన విద్యార్థులు) తిరుపతి, విజయవాడ, గుంటూరు హైద్‌ రాబాద్‌ పట్టణాల్లోని పలు కార్పొరేట్‌ కళాశాలలకు పెద్దఎత్తున వెళ్లి పోవడమేనని చెప్పుకోవాలి. మిగిలిన పేదరికం, ఆర్థిక స్తోమత లేని విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు చదవుల పట్ల అవేర్‌నెస్‌ లేకపోవడం మరొక కారణంగా చెప్పుకోవాలి. ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలలో అర్హత కలిగిన అనుభవం కలిగిన ఫ్యాకల్టీ ఉన్నప్పటికీ ఫలితాల్లో అట్టడుగున నిలు స్తున్నాం.పరీక్షల షెడ్యూల్‌ను తెలపండి? మార్చి ఒకటి నుంచి 20 వరకు థియరీ పరీక్షలు నిర్వహిస్తాం. విభజిత కడప జిల్లాలోని 69 సెంటర్లలో పరీక్షల్ని నిర్వహిస్తున్నాం. దీనికి ముందు ఫిబ్రవరి రెండు నుంచి 23 వరకు జిల్లాలోని 73 సెంటర్లలో ప్రాక్టికల్స్‌, ఒకేషనల్‌ పరీక్షలు నిర్వహిస్తాం. ఐదవ తేదీ నుంచి ఒకేషనల్‌, 11 నుంచి 20వ వరకు జనరల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహిస్తాం. ఫస్టియర్‌ విద్యార్థులకు ఎథిక్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ పరీక్షలు ప్రధానమైనవి. ఈమేరకు ఫిబ్రవరి రెండు, 23 తేదీల్లో ఎథిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ పరీక్షలుంటాయి. ప్రాక్టికల్స్‌ వ్యాల్యూయేషన్‌ను డిజిటల్‌ విధానంలో పరీక్షలు నిర్వహిం చడంతోపాటు ఏరోజుకు ఆరోజే మూల్యా ంకనం చేస్తాం.కళాశాలలు, విద్యార్థుల వివరాలు తెలపండి? జిల్లాలో 147 కళాశా లలున్నాయి. 20 ప్రభుత్వ, తొమ్మిది ఒకేషనల్‌, 11 ఎపిఎస్‌ డబ్య్లుఆర్‌ఎస్‌, ఐదు ఎయిడెడ్‌, మూడు మోడల్‌, 17 కెజిబివి, 10 హైస్కూల్‌ఫ్లస్‌, 72 ప్రయివేటు కళాశాల లున్నాయి. జిల్లా వ్యాప్తంగా 34,272 మంది విద్యార్థులున్నారు. జనరల్‌లో 31,648 మంది విద్యార్థుల్లో ఫస్టియర్‌లో 16,177 మంది, సెకెండ్‌ ఇయర్‌లో 18,095 మంది విద్యార్థులు ఉన్నారు.పరీక్షల ఏర్పాట్ల గురించి చెప్పండి? జిల్లాలోని 73 సెంటర్లలోని 720 గదుల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌లో సిసి కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించాం. బెంచ్‌లు, తాగునీరు, మెడికల్‌, విద్యుత్‌ సదుపాయాల కల్పనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యార్థుల రాకపోకలకు సంబంధించి ఆర్‌టిసి సహకారాన్ని తీసుకోవడమైంది.పరీక్షల పర్యవేక్షణ గురించి తెలపండి? జిల్లాలోని 15 సెంటర్లను సెన్సిటివ్‌గా గుర్తించాం. 73 సె ంటర్ల పర్యవేక్షణలో భాగంగా సెన్సిటివ్‌ కేంద్రాలపై నిఘా వేయడ మైంది. ఇందులోభాగంగా ప్రతి 20 సెంటర్లకు మూడు ఫ్లయింట్‌ స్వ్కాడ్స్‌,సెన్సిటింగ్‌ కేంద్రాల్లో మూడు సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ ఏర్పాటు చేయడమైంది.ఇంటర్మీడియట్‌ ఫలితాల మెరుగుదలపై సీరియస్‌గా దృష్టి సారించాం. గత ఫలితాల చేదు అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని ఇంటర్‌బోర్డు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పకడ్బందీగా సిద్ధమయ్యాం. ఫలితంగా ఇంటర్‌ ఫలితాల్లో కడప రాష్ట్రంలోని 26 జిల్లాల చివర స్థానం నుంచి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు పుష్కలముగా ఉన్నాయనే ధీమాతో ముందుకెళ్తున్నాం. దీంతోపాటు నాలుగు యూనిట్‌ పరీక్షలు, క్వార్టర్లీ, హాప్‌ఇయర్లీ, ప్రీఫైనల్‌ పరీక్షలను ప్రణాళికాబద్దంగా నిర్వహించాం. దీనికితోడు ఇంటర్‌బోర్డు అందించిన 50 రోజుల ‘జయీభవ’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయడమైంది. దీనికితోడు ప్రీఫైనల్‌ తదితర సంస్థాగత పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి సంబంధిత లెక్షకర్లతో ప్రత్యేక తర్ఫీదునిచ్చామని జిల్లాలో పరీక్షల పర్యవేక్షణకు డిఇసి కమిటీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుందని పేర్కొంటున్న ఇంటర్మీడియట్‌ ఆర్‌ఐఓ బండి వెంకట సుబ్బయ్యతో ముఖాముఖి…- ప్రజాశక్తి – కడప ప్రతినిధి

➡️