ఆస్కార్‌ నటుడు కున్‌ అనుమానాస్పద మృతి

Dec 27,2023 19:23 #movie

దక్షిణ కొరియాకు చెందిన నటుడు లీ సున్‌ కున్‌ (48) బుధవారం ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందారు. సియోల్‌లోని ఓ పార్కు వద్ద పార్కు చేసి ఉన్న కారులో ఆయన మృతి చెందివుండటాన్ని పోలీసులు గుర్తించారు. 92వ ఆస్కార్‌ విజేతలకు పారాసైట్‌ చిత్రంలో పార్క్‌ డాంగ్‌ ఇక్‌ అనే ధనవంతుడి పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. థ్రిల్లర్‌ హెల్ప్‌లెస్‌, ఆల్‌ అబౌట్‌ మై వైఫ్‌, ఎ హార్డ్‌ డే సినిమాల్లో నటించి కొరియాలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు. 1975లో ఆయన జన్మించారు. తొలుత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి ఆ తర్వాత హీరోగా మారారు. తనతో పనిచేసిన నటి జియోన్‌ హై జిన్‌ను 2009లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత అక్టోబర్‌లో సియోల్‌లోని ఓ బార్‌ ఉద్యోగితో కలిసి డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆరోపణలు రావటంతో విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన్ను ‘నో వే ఔట్‌’ అనే టీవీ సిరీస్‌ను తప్పించటంతో మనోవేధనతో ఉన్నారు. ఇంట్లో సూసైడ్‌ నోట్‌ కనిపించిందని పోలీసులకు భార్య ఫిర్యాదు చేశారు.

➡️