ఆశావర్కర్ల అరెస్టు దుర్మార్గం : సిఐటియు

ప్రజాశక్తి-ప్రొద్దుటూరు కడుపు కాలి వేతనాలు పెంచమని ప్రజ ాస్వామ్య బద్దంగా ఆందోళన చేస్తున్న ఆశావర్కర్లను ప్రభుత్వం అరెస్టు చేయి ంచడం దుర్మార్గమని సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ పేర్కొ న్నారు. విజయవాడ వెళ్తున్న ఆశావర్కర్లను అరెస్ట్‌ చేసినందుకు వ్యతిరేకంగా శుక్రవారం సాయంత్రం రాజీవ్‌సర్కిల్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పనిభారం తగ్గించమని వేతనాలు పెంచమని ఆశావర్కర్లు విజయవాడకు ధర్నాకు వెళ్తుంటే వారిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లడం అమానుష చర్య అన్నారు. పనిభారం తగ్గించి వేతనాలు పెంచమని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయకపోవడం కోర్టు తీర్పు ధిక్కరణ కిందకు వస్తుందన్నారు. కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలు బతికి బట్టకట్టిన సందర్భాలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశావర్కర్లకు వర్కర్లకు రూ.6500 ఇస్తూ రూ.10వేలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం మోసపూరితం అన్నారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందున సంక్షేమపథకాలు అందడంలేదన్నారు.కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి విజయకుమార్‌, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు, బాలసుబ్బయ్య, సంఘ అధ్యక్షులు ఎస్తేరురాణి, కౌసల్య రహణమ్మ, లకిë, మల్లేశ్వరి, తులసి, రామాంజనమ్మ, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

➡️