ఆరోగ్యం, ఆనందం, డబ్బు చాలా ముఖ్యం : విజయ్ దేవరకొండ

Mar 23,2024 19:11 #movie, #vijay devarakonda

జీవితంలో ఎవ్వరికైనా ఆరోగ్యం, ఆనందం, డబ్బు ఈ మూడు చాలా ముఖ్యమని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (టిపిజెఎ) ఆధ్వర్యంలో హెల్త్‌కార్డ్‌, డైరీ, ఐడి కార్డుల పంపిణీలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చూడాలని తెలంగాణా ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తిచేశారు. విజయ్ ప్రస్తుతం ‘ఫ్యామిలీస్టార్‌’ సినిమాలో నటిస్తున్నారు. మృణాల్‌ఠాకూర్‌ హీరోయిన్‌. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై పరశురామ్‌ తెరకెక్కిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 5న ఈ సినిమా విడుదల కానుంది.

➡️