ఆత్మకూరులో సత్యాన్వేషణ దినోత్సవం

Feb 17,2024 21:39
ఫొటో : బ్రూనే చిత్రపటానికి నివాళులర్పిస్తున్న జెవివి నాయకులు

ఫొటో : బ్రూనే చిత్రపటానికి నివాళులర్పిస్తున్న జెవివి నాయకులు
ఆత్మకూరులో సత్యాన్వేషణ దినోత్సవం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు పట్టణంలోని ఎస్‌సి బాలుర వసతి గృహంలో సత్యాన్వేషణ దినోత్సవాన్ని జనవిజ్ఞాన వేదిక ఆత్మకూరు మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆధునిక విజ్ఞాన శాస్త్రం అప్పటికి ఇంకా పురుడు పోసుకోలేదని తెలిపారు. మతం నమ్మకాలు బలంగా ఉన్న రోజులు సమస్త విశ్వం భూమి చుట్టూనే తిరుగుతుందన్నారు. నమ్మే కాలం సకల గ్రహాలు భూమి కేంద్రంగా తిరుగుతున్నాయని, గట్టి విశ్వాసం సిద్ధాంతానికి తెరతీసిన రోజుల్లోనే ఇటలీ దేశంలో నేర్పుల్స్‌ సమీపంలో ఉన్న నోలా పట్టణంలో 1548లో జన్మించిన బ్రూనో తాను నమ్మిన విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేవాడని తెలిపారు. ఈ గ్రహాలకు కేంద్రం సూర్యుడు కానీ భూమి కాదని తేల్చి చెప్పాడన్నారు. కోపర్నికస్‌ కంటే కూడా ముందుకెళ్లి మనకు కనబడే నక్షత్ర రాశుల సూర్యుడు దాని చుట్టూ ఉండే గ్రహాలని చెప్పాడని తెలిపారు. ఆ గ్రహాల్లో భూమ్మీద లాగే జీవం ఉన్నా ఉండవచ్చని సూత్రీకరించి ప్రపంచం మేధావుల్లో సంచలనాన్ని సృష్టించాడని తెలిపారు. మత పెద్దలు భూ కేంద్ర సిద్ధాంతం కరెక్ట్‌ అని చెప్పమని, 7 సంవత్సరాల పాటు నిర్బంధించి క్రూరంగా హింసించినప్పటికీ అంగీకరించ లేదన్నారు. క్రీస్తుశకం 1600 ఫిబ్రవరి 17వ తేదీన బహిరంగంగా కాల్చి చంపారని తెలిపారు. వారిని చంపిన 300 సంవత్సరాల తరువాత బ్రూనో చెప్పిందే సరైనదని రుజువైందన్నారు. అందుకే వారిని హత్య చేసిన రోజునే సత్యాన్వేషణ దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో జెవివి నాయకులు హరికృష్ణ, లక్కు కృష్ణ ప్రసాద్‌, షేక్‌ సంధాని, సాదిక్‌ హుస్సేన్‌ నందా శ్రీను, గద్దర్‌ బాబు పాల్గొన్నారు.

➡️