అవార్డుల బరిలో షారూక్‌ సినిమాలు

Jan 20,2024 07:55 #movie, #sharuk khan

హాలీవుడ్‌ అవార్డుల బరిలో బాలీవుడ్‌ హీరో షారూక్‌ఖాన్‌ రెండు సినిమాలు ఉన్నాయి. న్యూయార్క్‌కు చెందిన మ్యాగజైన్‌ ‘వల్చర్‌ 2023 యాన్యువల్‌ స్టంట్‌’ అవార్డుల కోసం నామినేషన్లు ప్రకటించింది. ఇందులో అట్లీ తెరకెక్కించిన ‘జవాన్‌’ మూడు కేటగిరీల్లో నామినేషన్లు దక్కించుకుంది. బెస్ట్‌ ఓవరాల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌తోపాటు స్టంట్స్‌కు సంబంధించిన మరో రెండు కేటగిరీల్లోనూ హాలీవుడ్‌ చిత్రాలతో కలిసి పోటీ పనుంది. సిద్ధార్ధ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ‘పఠాన్‌’ రెండు విభాగాల్లో పోటీ పడనుంది. హాలీవుడ్‌ హీరో టామ్‌ క్రూజ్‌ నటించిన ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ కూడా పోటీలో ఉంది.

➡️