అమలులో ఎన్నికల కోడ్‌శ్రీ కొత్త ఓటర్లు 36,083 శ్సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 415శ్రీ వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరం శ్రీ జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్‌ ఎస్‌ షన్మోహన్‌

అమలులో ఎన్నికల కోడ్‌శ్రీ కొత్త ఓటర్లు 36,083 శ్సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 415శ్రీ వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరం శ్రీ జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్‌ ఎస్‌ షన్మోహన్‌

అమలులో ఎన్నికల కోడ్‌శ్రీ కొత్త ఓటర్లు 36,083 శ్సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 415శ్రీ వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరం శ్రీ జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్‌ ఎస్‌ షన్మోహన్‌ ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌ మేరకు సార్వత్రిక ఎన్నికలు 2024 ను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం పూర్తిగా సంసిద్ధమైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌ షన్మోహన్‌ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ సాధారణ ఎన్నికలు – 2024 షెడ్యూలు విడుదల చేసిన నేపథ్యంలో ఆదివారం జిల్లా సచివాలయం లోని సమావేశపు మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, ఎస్‌ పి జాషువా, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి శ్రీనివాసులు, డిఆర్‌ఓ బి పుల్లయ్య తో కలిసి ఎన్నికల సన్నద్ధత, నిర్వహణకు సంబంధించి జిల్లాలో చేపడుతున్న కార్యాచరణ వివరాలు వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే నెల 18వ తేది విడుదల చేయనున్నట్లు తెలిపారు. నామినేషన్స్‌ స్వీకరణ ఏప్రిల్‌ 25వ తేది నుండి చేపడుతారని, 26న నామినేషన్ల పరిశీలన, 29వ తేది నామినేషన్ల ఉపసంహరణ, మే 13 వ తేది పోలింగ్‌ నిర్వహించనున్నట్లు వివరించారు. కౌంటింగ్‌ జూన్‌ 4వ తేది ఉంటుందని జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక్క పార్లమెంట్‌ నియోజవర్గానికి ఎన్నికలు జరగనున్నాయని చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 15,56,247 మంది ఓటర్లు వున్నారని ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు ఓటర్ల నమోదు కోసం వచ్చి దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించారని వెయ్యి నుండీ రెండు వేల ఓట్లు అదనంగా పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని 15,56,247 మంది ఓటర్లలో పురుషులు 7,66,440, స్త్రీలు 7,89,732,థర్డ్‌ జెండర్‌ 75 మంది ఉన్నారని, 18-19 సంవత్సరాల వయస్సు ఉండి కొత్తగా నమోదైన ఓటర్ల 36,083 కాగా ఇందులో పురుషులు 19,766, స్త్రీలు 16,317 ఓటర్లు కాగా వికలాంగుల ఓటర్లు 23,503 మంది ఉన్నారు. 85 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల ఓటర్లు 5,167 మంది వున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ సర్వీస్‌ ఓటర్లు మొత్తం 3,375 కాగా ఇందులో పురుషులు 3,320, స్త్రీలు 55 మంది వీరందరూ ఓటు హక్కు వినియోగించుకొనేలా పోస్టల్‌ బ్యాలెట్‌ అందించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ స్టేషన్లు 1,771 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అర్బన్‌ 362, రూరల్‌ 1400 కాగా 1,266 ప్రాంతాల్లో ఈ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్లిష్టమైన (క్రిటికల్‌) పోలింగ్‌ స్టేషన్ల 415 గుర్తించామన్నారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో వీడియో చిత్రీకరణ, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో విద్యుత్‌, ర్యాంపు, మంచి నీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో నియోజక వర్గానికి మూడు చొప్పుున ప్లేయింగ్‌ స్క్వాడ్‌ల ఏర్పాటు, అంగన్‌వాడీ, ఆశా, వాలంటీర్లకు ఎన్నికల విధులు కేటాయించడం లేదని స్పష్టం చేశారు. ఎస్పీ జాషువా మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలను నిర్వహించడానికి పోలీస్‌ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలో క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి డిఎస్పీ స్థాయి అధికారులు పరిశీలించారని తెలిపారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీస్‌ శాఖ ద్వారా 16 చెక్‌ పోస్ట్‌ ల ఏర్పాటు చేశారని, 235 బైండోవర్‌ కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు రూ.1.3 కోట్ల నగదు సీజ్‌ చేయడంతో పాటు 514 కేసులు నమోదు చేసి 8,300 లీటర్లు లిక్కర్‌ను సీజ్‌ చేశామని, జిల్లాలో ఎలాంటి అలజడులు జరగ కుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం నుండి మూడు కంపెనీలు, సిఆర్‌పిఎఫ్‌, ఏపి ఎస్‌పి, రిజర్వు పోలీసు బలగాలు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. వివిధ రాజకీయ పార్టీ నాయకులు ప్రచారం, సమావేశాల నిర్వహణకు ముందస్తుగా సంబంధిత సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి నుండీ అనుమతి తప్పని సరిగా తీసుకోవాలన్నారు. ్‌పకడ్బందీగా ఎన్నికల నిబంధనలు వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర ఎన్నికల అధికారితో కలెక్టర్‌ ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల్లో పకడ్బందీగా మౌలిక సదుపాయాలు చేపడుతున్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌ షన్మోహన్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా కు వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ స్థలాలలో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగ్‌లు, పోస్టర్లు, కటౌట్లను నేటి మధ్యాహ్నం 3 గంటల లోపు తొలగించాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న ఎన్నికల కసరత్తును కలెక్టర్‌ ఈ కాన్ఫరెన్స్‌లో వివరించారు. జిల్లా వ్యాప్తంగా మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. సీ విజిల్‌ లో నమోదయ్యే ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రం ప్రపోజల్స్‌ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఏప్రిల్‌ 18 నోటిఫికేషన్‌ జారీకి కసరత్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఈసీకి వివరించారు.

➡️