అనురాధ సేవలు అభినందనీయం

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో టిబి, లెప్రసీ విభాగాలతో పాటు అదనపు డిఎంహెచ్‌ఒ బాధ్యతలను

అనురాధను సన్మానిస్తున్న డిఎంహెచ్‌ఒ మీనాక్షి

డిఎంహెచ్‌ఒ బి.మీనాక్షి

శ్రీకాకుళం అర్బన్‌ :

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో టిబి, లెప్రసీ విభాగాలతో పాటు అదనపు డిఎంహెచ్‌ఒ బాధ్యతలను డాక్టర్‌ అనురాధ ఎంతో సమర్థవంతంగా నిర్వహించారని, ఆమె సేవలు అభినందనీయమని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ బి.మీనాక్షి అన్నారు. డాక్టర్‌ అనురాధ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ సందర్బంగా బుధవారం డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో ఉద్యోగులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువకప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్బగా మీనాక్షి మాట్లాడుతూ వైద్యఆరోగ్య శాఖ పరిధిలో తనకు ఎంతో తోడ్పాటుగా నిలిచారన్నారు. విధి నిర్వహణలో ఆమె మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. భవిష్యత్‌లో ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మాస్‌ మీడియా అధికారి పైడి వెంకటరమణ మాట్లాడుతూ పేదలకు నిస్వార్ధమైన సేవలు, వృత్తిపరమైన బాధ్యతలను ఎంతో సమర్థతతో నిర్వర్తించారన్నారు. సన్మాన గ్రహీత అనూరాధ మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో సంతృప్తి నిచ్చిందన్నారు. భవిష్యత్‌లో పేదలకు తనవంతు సేవలందిస్తానన్నారు. కార్యక్రమంలో డా పి.ప్రకాశరావు, డా సిపి శ్రీదేవి, డా సుజాత, డా వెంకట లక్షి, డా ప్రవీణ్‌ కుమార్‌, శైలజా, వెంకటేశ్వరరావు, కె.వి. నారాయణరావు, సూర్యకళ, మోహిని పాల్గొన్నారు.

 

➡️