అధికారులు అప్రమత్తం

ఎన్నికల కోడ్‌పై అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్కడా కోడ్‌

రణస్థలం : అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- రణస్థలం

ఎన్నికల కోడ్‌పై అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్కడా కోడ్‌ ఉల్లంఘనలు జరగకుండా చూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం మండలంలో పర్యటించారు. ముందుగా తహశీల్దార్‌ కార్యాలయంలో ఓటర్లు జాబితాను పరిశీలించారు. పైడిభీమవరం చెక్‌పోస్టు తనిఖీ చేసి సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా ముఖద్వా రం పైడిభీమవరంలో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని పోలీస్‌శాఖకు ఆదేశించారు. కోష్ట పంచాయతీలో పల్లిపేటలోని 182, 183 పోలింగ్‌ కేంద్రాలను, 183 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను సం దర్శించారు. ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటు న్నారా? అని బిఎల్‌ఒను అడిగి తెలుసుకున్నారు.లావేరు : మండలంలోని వెంకటాపురం జిల్లా సరిహద్దు ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే అప్పాపురంలోని 84, 85 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు వద్ద కట్టుదిట్టంగా ఉండాల ని ఆదేశించారు. తరచూ తనిఖీలు చేపట్టాలన్నారు. వెంకటాపురం వద్ద చీపురుపల్లి వెళ్లే రహదారి, వెంకటాపురం నుంచి విజయనగరం జిల్లా నిమ్మలవలస మీదగా రాజాం వెళ్లే కూడలిలో రెండు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయలని అన్నారు. అప్పాపురం గ్రామాన్ని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాన్ని ఎందుకు గుర్తించారని అధికారులను ప్రశ్నించారు. ఒన్‌సైడ్‌ ఓటింగ్‌ జరుగుతుండటంతో గుర్తించామని తెలిపారు. ఈయన వెంట ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి లక్ష్మణమూర్తి, తహశీల్దార్‌ పి.లక్ష్మీదేవి, జె.ఆర్‌.పురం సిఐ జి.రామచంద్రరావు, ఎస్‌ఐ సిహెచ్‌.స్వామినాయుడు ఉన్నారు.

 

➡️