అక్షరాస్యత సాధనే ఆచార్యులుకు నివాళి

Mar 30,2024 23:54
అక్షరాస్యత సాధనే ఆచార్యులుకు నివాళి

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంసమాజంలోని ప్రజలంతా అక్షరాస్యులు అయినపుడే ఆచార్యులు ఆశయాలను సాధించిన వారమవుతామని భద్రాచలం మాజీ పార్లమెంట్‌ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు అన్నారు. స్థానిక కోరుకొండ రోడ్డులోని యుటిఎఫ్‌ కార్యాలయంలో అక్షర దీక్ష ఆచార్యులుగా పేరుగాంచిన ఎంఎవిఎల్‌ఎన్‌.ఆచార్యులు 31వ వర్థంతి సభ జనవిజ్ఞాన వేదిక, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ యుటిఎఫ్‌, ప్రజా సంఘాలు సంయుక్తంగా నిర్వహించాయి. ఆచార్యులుకు ఆయన కుటుంబ సభ్యులు, నాయకులు నివాళి అర్పించారు. అనంతరం బాబూరావు మాట్లాడుతూ అక్షరాస్యత ఉద్యమం విజయవంతం చేయడంలో ఆచార్యులు పాత్రను వివరించారు. తన కుటుంబాన్ని కూడా వదులుకొని ఎప్పుడూ అక్షరాస్యత ఉద్యమమే శ్వాసగా జీవించారన్నారు. డాక్టర్‌ చైతన్య శేఖర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అక్షరాస్యత ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళవలసిన అవసరం ప్రస్తుత సమాజంలో ఉన్నదని తెలిపారు. బాలోత్సవ నిర్వాహకులు తులసి మాట్లాడుతూ ఇప్పటికీ పూర్తి అక్షరాస్యతను సాధించలేకపోవడం దేశ అభివృద్ధికి మంచిది కాదన్నారు. ఎన్‌.రవిబాబు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం జెవివి చేస్తున్న కార్యక్రమాలు, కృషిని వివరించారు. సబాధ్యక్షలు ఎం.మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆచార్యులు ఆశయ సాధనకై అందరూ పాటుపడాలని కోరారు. జెవివి నాయకులు తాతారావు, నిశ్చల్‌, యుటిఎఫ్‌ సహాధ్యక్షురాలు ఎం.విజయగౌరి, రూపస్‌ రావు, శ్రీమణి, తులసి, పి.మురళి, టి.సావిత్రి, బి.పవన్‌, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️