అక్షరం

Dec 31,2023 07:20 #Jeevana Stories, #Kavitha

పుస్తకంలో ఉంటుంది అక్షరం

ఆ అక్షరాలే పదాలవుతాయి

పదాలే ఒక వాక్యమైతే

వాక్యాలే మనకు పాఠాలు

అట్టి పాఠాలే మనకు చదువులు

అందుకే పుస్తకమంటే మనకిష్టం

గురువుల బోధనలు మనకు ప్రాణం

మనలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకొని

మనకు తేజస్సును నింపుతారు

ఆటలలో పాటలలో అన్నింటా

మమ్ములను ముందు నిలిపేది గురువులు

అందుకే మనకు అక్షరం అమృతం

మన గురువులకు వందనం!

 

 

 

 

 

– నవదీప్‌, 6వ తరగతి,

హవేలీ ఘనపూర్‌,

మెదక్‌ జిల్లా,91824 46399.

➡️