అంబేద్కర్‌ అందరివాడు : మంత్రి

ప్రజాశక్తి – త్రిపురాంతకం : అంబేద్కర్‌ అందరి వాడని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. అంబేద్కర్‌ వర్ధంతి సంధర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి సురేష్‌ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ సింగారెడ్డి, పోలిరెడ్డి,తహశీల్దారు కిరణ్‌, నాయకులు గోపాల్‌రెడ్డి, సుబ్రమణ్యం, గొట్టెముక్కల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. యర్రగొండపాలెం : అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దొంతా కిరణ్‌ గౌడ్‌, జడ్‌పిటిసి చేదూరి విజయభాస్కర్‌, సర్పంచి రామావత్‌ అరుణాబాయి, వైసిపి మండల కన్వీనర్‌ కొప్పర్తి ఓబుల్‌రెడ్డి, పుల్లలచెరువు మండల కన్వీనర్‌సుబ్బారెడ్డి, సొసైటీ ప్రెసిడెంట్‌ మేడం వెంకటరెడ్డి పాల్గొన్నారు. మార్కాపురం : భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత అంబేద్కర్‌ అని రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్దిశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ కొనియాడారు. డాక్టర్‌ శామ్యూల్‌ జార్జి ఇంజినీరింగ్‌ కళాశాలలో అంబేద్కర్‌ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జార్జి విద్యా సంస్థల కార్యదర్శి ఆదిమూలపు విశాల్‌, త్రిపురాంతకం ఎంపిపి కోట్ల సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు పిచ్చయ్య, రెంటపల్లి సుబ్బారెడ్డి, ఓబుల్‌రెడ్డి, పోరెడ్డి చెంచిరెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజబాబు, అకడమిక్‌ డీన్‌ డాక్టర్‌ మస్తానయ్య, సురేష్‌ కుమార్‌ పాల్గొన్నాఉ.కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షుడు జవ్వాజి రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్మా బాలనాగయ్య, కెవిపిఎస్‌ నాయకులు నాగరాజు, కాశయ్య, రమేష్‌, స్టీఫెన్‌, విక్టర్‌, పవన్‌, ఎంపిజె రాష్ట్ర నాయకులు రజాక్‌ పాల్గొన్నారు. పెద్దదోర్నాల : నటరాజ్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి సర్పంచి చిత్తూరి హారిక,కార్యదర్శి మోహన్‌రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి జోగి వెంకటనారాయణ, సిపిఐ నాయకులు తిరుమలయ్య, కోడి మోహన్‌రావు, శంకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పుల్లలచెరువు : ఎంపిడిఒ కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి ఎంపిపి కందుల వెంకటయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి లింగంగుంట్ల రాములు, ఎంపిడిఒ మరియదాసు, ఇఒఆర్‌డి శరత్‌, పంచాయతీ సెక్రెటరీ బాలు నాయక్‌ పాల్గొన్నారు. కొత్తపట్నం : అంబేద్కర్‌ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి ఎంపిడిఒ పి. సుజాత ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఈతముక్కల పిహెచ్‌సి వైద్యుడు డాక్టర్‌ శివపార్వతి, ఎంపిపిఎస్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు, గ్రామ వాలంటీరు కొండలరావు, చెక్కా సురేంద్ర ,సరళ, సొసైటీ ప్రెసిడెంట్‌ దుగ్గిరాల విజరు కుమార్‌, సజన పాల్గొన్నారు. హనుమంతునిపాడు : మండల పరిధిలోని మహాద్మాపురం పాఠశాలలో అంబేద్కర్‌ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు దద్దాల శ్రీనివాసులు, ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి, విజయ భాస్కర్‌ రెడ్డి, చిన్న బాలయ్య, మర్రి మోషే, అహ్మద్‌ బాషా,శ్రీదేవి, హిమబిందు,వై.శ్రీను,సందాని బాషా, శశి భూషణ్‌, ఆర్‌. శ్రీను పాల్గొన్నారు. మద్దిపాడు : వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేద్కర్‌ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రబమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఉబ్బ వెంకటేశ్వర్లు, నాయకులు కాకుమాను సుబ్బారావు, అంగలకుర్తి సింగయ్య, కాసిం, కొండయ్య పాల్గొన్నారు. వెలిగండ్ల : అంబేద్కర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి గోనా ప్రతాప్‌, గోన వెంకటయ్య, టిడిపి అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి, కొండు విజయభాస్కర్‌రెడ్డి, గోన దేవా, అంకయ్య, తగరం అంకయ్య, కారంపూడి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, పుల్లారెడ్డి, టి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.చీమకుర్తి : స్థానిక పోలీసు స్టేషన్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బిఎన్‌ విజయకుమార్‌, టిడిపి జిల్లా నాయకులు కాట్రగడ్డరమణయ్య,ఉన్నం సుబ్బారావు, గొల్లపూడి సుబ్బారావు, శేషయ్య, గంగుల శివపార్వతి, రావిపాటి రాంబాబు, యడ్లపల్లి రామబ్రహ్మం ,సూరంపల్లి హనుమంతరావు,నాగరాజు,యలమందపాల్గొన్నారు. కెఎన్‌పిఎస్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కెఎన్‌పిఎస్‌ రాష్ట్ర నాయకులు దుడ్డు వెంకటరావు, నాయకులు రాంబాబు, కొండలు, పోతురాజు, డేవిడ్‌రాజు, కిషోర్‌, బ్రహ్మయ్య పాల్గొన్నారు. సిఎస్‌పురంరూరల్‌ : మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ వర్ధంతి నిర్వహించారు.ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ మండల కార్యదర్శి బక్కా జేసురత్నం, దేవరాజు, ఏసురత్నం, జోసఫ్‌, దేవదానం, పేతురు, మార్క్‌, ఏసోబు, ఇజ్రాయేల్‌, బాషా పాల్గొన్నారు..కనిగిరి : అసమానతలు లేని సమావేశం కోసం అంబేద్కర్‌ కృషి చేసినట్లు టిడిపి కనిగిరి నియోజక వర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు, నాయకులు రాచమల్ల శ్రీనివాసరెడ్డి, ముచ్చుమారి చెంచిరెడ్డి, షేక్‌ ఫిరోజ్‌, షేక్‌ అహ్మద్‌, పిచ్చాల శ్రీనివాసరెడ్డి, తమ్మినేని వెంకట్‌ రెడ్డి, చింతలపూడి తిరుపాలు, ఆర్‌వి.నారాయణ, పాలూరి సత్యం, ఈదర రవికుమార్‌, బుల్లా బాల బాబు, గుడిపాటి ఖాదర్‌, తమ్మినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. దర్శి : ఎమ్మెల్యే మద్దిశెట్టిక్యాంపు కార్యాలయంలో వైసిపి నాయకులు అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.ఎంపిడిఒ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. పొదిలి : పొదిలి ఆర్‌టిసి డిపో గ్యారేజ్‌ ఆవరణలో అంబేద్కర్‌ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్‌ సుందరావు, గ్యారేజ్‌ సూపర్‌వైజర్‌ నాగరాజు, గ్యారేజ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఎస్‌పి నియోజక వర్గ అధ్యక్షుడు సండ్రపాటి కాలేబు మాదిగ, ఎంపిజె కనిగిరి డివిజన్‌ నాయకుడు గురిజాల బాబురావు మాదిగ, దళిత బహుజన సేన పోరాట సమితి నాయకులు ఆదిమూలపు రవి, గంగవరపు నాగులు, మల్లెల శ్యామ్‌, ఎంఆర్‌పిఎస్‌ మండల అధ్యక్షుడు వేల్పుల సురేష్‌ మాదిగ పాల్గొన్నారు. పిసిపల్లి : మండల పరిధిలోని గోపవరపుపల్లి అంబేద్కర్‌ వర్ధంతి నిర్వహించారు.ఈ సందర్బ:గా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒలు ఆర్‌.శ్రీనివాసులు, జి.సంజీవ్‌, ఉపాధ్యాయులు డి.సుబ్బరాయుడు, కె.గురువారెడ్డి, నాగేశ్వరరావు పాల్గొన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడిఒ కె.శ్రీనివాసరెడ్డి, తహశీల్దారు కె.ప్రవీణ్‌కుమార్‌, మాజీ వైస్‌ ఎంపిపి పి.మహేష్‌నాగ్‌, ఎంఆర్‌పిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.రాజు అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. శింగరాయకొండ : మండల పరిధిలోని కలికవాయ గ్రామంలో కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ కొండపి నియోజకవర్గం కార్యదర్శి వేసుపోగు మోజెస్‌, కెవిపిఎస్‌ మండల కన్వీనర్‌ పేముల బాబూరావు, టంగుటూరి రాము, పేముల భాస్కర్‌, రావినూతల బుజ్జి, పేముల అచ్చయ్య, కసుకుర్తి ప్రసాదు, మిడసల రాము, వల్లూరి రవి పడిదపు రవి కుమార్‌ పాల్గొన్నారు. తహశీల్దారు ఉష ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, పోలీస్‌ స్టేషన్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి కమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒంగోలు సబర్బన్‌ : అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా వైసిపి జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నగర మేయర్‌ గంగాడ సుజాత, వైసిపి నగర కన్వీనర్‌ కటారి శంకర్‌, చీమకుర్తి జడ్‌పిటిసి వేమా శ్రీనివాసరావు, దామారాజు క్రాంతికుమార్‌, నత్తల భీమేష్‌ తదితరులు పాల్గొన్నారు. పేర్నమిట్టలో…. అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా 40వ డివిజన్‌ పరిధిలోని పేర్నమిట్ట ఇందిరానగర్‌ కాలనీలో అంబేద్కర్‌ చిత్రపటానికి స్థానిక కార్పొరేటర్‌ తేళ్ల చంద్రశేఖర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు. కొండపి : అసమానతలు లేని అభివద్ధి సాధన కోసం ఉద్యమిం చటమే అంబేద్కర్‌కు ఘన నివాళి అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కెజి.మస్తాన్‌ తెలిపారు. అంబేద్కర్‌ వర్ధంతి సంద ర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో నాయకులు వై. సతీష్‌, వై.నారాయణ, సిద్ధయ్య, వెంకటేశ్వర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

➡️