అంతా ‘అక్రమం’!

Jan 21,2024 22:48
అంతా 'అక్రమం'!

ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: అక్కడ, ఇక్కడ అని కాదు.. జిల్లాలోని అనేక ఇసుక రీచ్‌లతో అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. అట్టుకట్ట వేయా ల్సిన మైనింగ్‌, రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో నోరుమెదపని పరిస్థితి. ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసి ప్రజా ప్రతినిధులు ఇసుక రీచ్‌లు, అక్రమ మద్యం అమ్మకాల ద్వారా ఆదాయాల లోటును పూడ్చుకొనే పనిలో పడ్డారని ప్రజలు ఆరోపిస్తున్నారు. చిత్తూరు, జీడి నెల్లూరు, గుడిపాల, తవణంపల్లి, యాదమరి ఇలా ఆయా ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన నేతలు ఇసుక అక్రమ రవాణా ఆదాయ మార్గంగా ఎంచుకున్నట్లు ఆప్రాంతాల్లోని ప్రజలు వాపోతున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు సైతం వెనకాడడంలేదని అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదంటున్నారు. కలికిరి మండలంలో గుండ్లూరు ఇసుక రీచ్‌ కాంట్రాక్టర్‌ మైనింగ్‌ నిబంధనలను తుంగలో తొక్కుతు న్నారు. రైతులు అనేకసార్లు భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు ఎండిపో తున్నాయని గొంతు చించుకొని కొట్టుకుంటున్న ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మైనింగ్‌ అధికారులు కాంట్రాక్ట్‌ కి ఇచ్చిన నిబంధనల్లో స్పష్టంగా 10 మీటర్ల లోపు ఉంటే జేసీబిలతో తవ్వకాలు చేపటరాదనే నిబంధనలు ఉన్నాయి. వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా ఇష్టా రాజ్యంగా హిటాచి లను ఉపయోగించి ఇసుకను ట్రిప్పర్స్‌ ద్వారా తరలిస్తున్నారు. కూలీల ద్వారా ఇసుక తవ్వకాలు చేపటాలని ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను జేసీబి, ఇటాచీల ద్వారా తవ్వకాలు చేపట్టి యద్ఛేగా తరలిచేస్తున్నారు. లైసెన్స్‌ ఓ చోట త్వకాలు మరోచోట గుండ్లూరు రీచ్‌ కి ఇచ్చిన లైసెన్స్‌ తీసుకొని చీకటి పల్లి ఇసుక రీచ్‌ నుంచి భారీ స్థాయిలో ఇసుక తరలిస్తున్నారని చీకటిపల్లి రైతులు చెబుతున్నారు. అక్రమంగా ఇసుకను తరలించడంవల్ల తమ వాగుల్లో నీరు ఇంకిపోయి పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను స్థానిక తహశీల్దార్‌, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు అనేకసార్లు ఇసుక లారీలను అడ్డుకున్న అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదు. మండలంలో ఇసుక రీచ్‌ లు రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో నడుస్తాయి. ఇక్కడ రెవెన్యూ అధికారులు మాత్రం వాటి జోలికి పోవడం లేదు. కాంట్రాక్టుర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి అధికారులు నిమ్మకుంటున్నారనే అరోపలున్నాయి. ఇసుక రీచ్‌ కాంట్రాక్టర్లకు రైతులకు గొడవలు అవుతున్న రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పర్మిషన్‌ లకు మించి అదనంగా తరలిస్తున్నారు. ఇసుక రీచ్‌ లో సీసీ కెమెరాలు ఉండాలని ప్రభుత్వ నిబంధన. ఇక్కడ మాత్రం అలాంటివి ఏమీ లేవు. ఇసుకను ఎవరికి.. ఎందుకు..ఏ అసరాల కోసం ఇసుక ఎన్ని లోడ్లు ఇస్తున్నారో స్పష్టంగా రాసి ఇవ్వాలి. ఆ రసీదుల్లో నంబర్లు ప్రకారం వాడాలి. ఇక్కడ ఏమి పాటించకపోయినా మైనింగ్‌ అధికారులు మాత్రం ఆ వైపున వచ్చే పరిస్థితి లేదు. రైతులను,ప్రజల కూడా పట్టించుకోకుండా మైనింగ్‌ అధికారులు నిర్లక్ష్యం వహించడం సరైంది కాదు. చిత్తూర్‌ లో ఉన్న మైనింగ్‌ ఏడి తో మేం మాట్లాడుకుంటామని నాకు పర్మిషన్‌ ఇచ్చారని కాంట్రాక్టర్లు చెప్తుంటే ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతునారో అర్థమవుతుంది. మైనింగ్‌ రూల్స్‌ ఒక్కటి కూడా పాటించడం లేదు. రెవెన్యూ అధికారులు మీరు మీరు చూసుకోండి ‘మాకేం సంబంధం’ అని రైతులకు చెబుతున్నారు. గుండ్లూరు ఇసుక రీచ్‌ లో భారీ స్థాయిలో ఇసుకను తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి చుట్టుపక్కల వందల ఎకరాల రైతులు వ్యవసాయం నష్టపోతున్నారు. కాంట్రాక్టు మీద అంత ప్రేమ ఎందుకు అర్థం కాని పరిస్థితి. సామాన్య ప్రజలు ఇసుకకు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సొంత ఊర్లో సొంత ఇసుకను కూడా రైతులు తీసుకునే పరిస్థితి లేదు. ఇసుకతో కాంట్రాక్టర్‌ మాత్రం కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాంటి లోపాలు జరగకూడదని స్పష్టంగా సంబంధిత మంత్రి తెలియజేస్తున్న జిల్లాలోని కొన్ని ఇసుక రీచ్‌లతో ఏ మాత్రం ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు ముఖ్యంగా కలికిరి మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. కలికిరి మండలంలో ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల తీరు బాగా లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ సమస్యను జిల్లా మైనింగ్‌, రెవెన్యూ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రైతులు, ప్రజలక న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్రమ ఇసుక రవాణా అరికట్టాలి జిల్లాలోని అనేక ఇసుక రీచ్‌ల్లో అక్రమ త్రవ్వకాలు అధికారుల అండతో కోట్ల రూపాయల ప్రజా ధనం కొల్లగొడుతున్నారు. అక్రమ ఇసుక దందాపై మైనింగ్‌, రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకొని అరికట్టాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన వారే ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. జిల్లా నుండీ పక్క రాష్ట్రలకు ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో అక్రమ రవాణా అరికట్టి ఇసుక రీచ్‌ల సమీప పొలాలకు నీరు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఇసుక అక్రమ తవ్వకాలు అక్రమ రవాణాపై అధికారులు చర్యలు తీసుకోకుంటే ఆందోళన కార్యక్రమాలకు పూనుకోవాల్సి వస్తుంది. – వాడ గంగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి.

➡️