అంతర్జాతీయ అబాకస్‌ పోటీల్లో ధర్మవరం విద్యార్థుల సత్తా

Feb 18,2024 21:26

అంతర్జాతీయ అబాకస్‌ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులతో వైద్యులు,లాయర్‌

                      ధర్మవరం టౌన్‌ : అంతర్జాతీయ అబాకస్‌ పోటీలలో ధర్మవరానికి చెందిన మిరాకిల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ విద్యార్థులు సత్తా చాటారని డైరెక్టర్‌ శ్రీవాణి, సంస్థ ప్రాంచైజీ చంద్రశేఖర్‌ తెలిపారు. అంతర్జాతీయ అబాకస్‌ పోటీల్లో ప్రతిభ చూపిన ధర్మవరం విద్యార్థులను పట్టణంలోని ఎన్జీవో హోంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అభినందించారు. ముఖ్య అతిథులుగా హాజరైన వైద్యులు శీబా నగేష్‌గుప్త, న్యాయవాది క్రిష్ణమోహన్‌ తదితరులు విజేతలకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల చెన్నైలో జరిగిన 8వ అంతర్జాతీయ అబాకస్‌ పోటీల్లో ధర్మవరానికి చెందిన మిరాకిల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌కు చెందిన 22 మంది విద్యార్థులు బహుమతులు సాధించారన్నారు. నాగహితశ్రీ, తేజక్రిష్ణ ఛాంపియన్‌ షిప్‌ సాధించారన్నారు. కేదార్నాథ్‌, సంజరు, జాన్వి, విఖ్యాత్‌, భవిన్సాయి అత్యున్నత ప్రతిభ కనబరిచి గ్రాడ్యుయేషన్‌ అర్హత సాధించారన్నారు. హేమన్య, నాగసాయి ఆదర్శ్‌, అక్షిత్‌, జశ్వంత్‌, ఆదిత్య, శ్రీనిత్య, సాయివర్షిణి, హిమజ, భానుప్రకాష్‌, భవ్య, మోక్షజ్జ, గ్రీష్మ, కావ్యలు విన్నర్‌షిప్‌ సాధించారని తెలిపారు. అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించాలని కోరారు.

➡️