డబ్ల్యూటీఓ ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలి : రైతు సంఘం

ఆదోని (కర్నూలు) : డబ్ల్యూటీఓ ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకొని రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈరన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న డిమాండ్‌ చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో కిసాన్‌ మోర్చా శంబు బార్డర్‌ దగ్గర రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా సోమవారం ఆదోని పట్టణంలో స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్‌ మైదానం నుండి ప్రధాన రోజు కూడా బైక్‌ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …. పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధత చేయాలని, రైతుల పంట రుణాలన్నీ మాఫీ చేయాలని, రైతాంగ ఉద్యమంలో మరణించినవారికి ఎక్స్‌ గేషియా ప్రకటించాలని, 2022వ సంవత్సరం విద్యుత్‌ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని, డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అన్నం పెట్టే రైతన్నకు భరోసా ఉండాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వలనే వ్యవసాయం కుంటుపడే ప్రమాదం ఉందన్నారు. రైతుల డిమాండ్లను పరిష్కరించాలని లేకపోతే రైతుల ఆగ్రహానికి కేంద్ర ప్రభుత్వం పతనం కాక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, సిపిఐ మండల కార్యదర్శి కాలభావి రాజు, సిఐటయు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, మండల కార్యదర్శి గోపాల్‌, తిప్పన, వీరారెడ్డి, డివైఎఫ్‌ఐ అధ్యక్షులు వీరేష్‌, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి వెంకన్న, రైతు సంఘం మండల అధ్యక్షులు అయ్యప్ప, నాయకులు బాష, తిక్కప్ప, హనుమంత్‌ రెడ్డి, వెంకటేష్‌ పాల్గొన్నారు

➡️