శాస్త్రీయ సమాజ నిర్మాణానికి రచయితలు ముందుకు రావాలి

అశాస్త్రీయ భావనలు, మూఢనమ్మకాలు పెరుగుతున్న

జనార్థనరావును సత్కరిస్తున్న జెవివి నాయకులు

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గిరిధర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

అశాస్త్రీయ భావనలు, మూఢనమ్మకాలు పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రీయ సమాజం, ప్రజా సంక్షేమం కోసం కవులు, రచయితలు తమ రచనలతో ప్రజానీకాన్ని చైతన్యవంతం చేయాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్‌, జిల్లా అధ్యక్షులు కుప్పిలి కామేశ్వరరావు పిలుపునిచ్చారు. నగరంలోని యుటిఎఫ్‌ భవన్‌లో జెవివి జిల్లా కమిటీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగాదిని పురస్కరించుకుని సమాజాభివృద్ధిలో యువత పాత్ర అనే అంశంపై జనవిజ్ఞాన వేదిక పిలుపుమేరకు అనేకమంది కవులు, రచయితలు కవితలు, వ్యాసాలు రాసి పంపారని తెలిపారు. జిల్లాస్థాయి కవితల పోటీల్లో ఆమదాలవలసకు చెందిన కుప్పిలి వెంకట రాజారావు, బూర్జ మండలానికి చెందిన పప్పల వైకుంఠరావు, కోటబొమ్మాళికి చెందిన నవ్యశ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారని చెప్పారు. గార మండలానికి చెందిన భోగెల ఉమామహేశ్వరరావు కన్సొలేషన్‌ బహుమతికి ఎంపికయ్యారని తెలిపారు. వ్యాసరచన పోటీల విజేతలుగా ప్రథమ స్థానం జి.సిగడాంకు చెందిన కోవెలకొండ సంతోష్‌ కుమారస్వామి, శ్రీకాకుళం నగరానికి చెందిన చాడ శ్రీనివాసరావు, ఇచ్ఛాపురానికి చెందిన ఎస్‌.వాహిని ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారని చెప్పారు. అనంతరం విజేతలకు మెమోంటోలు, డైరీలు, పుస్తకాలను అందించి సత్కరించారు. కవితలతో ప్రజలను చైతన్యవంతం చేస్తున్న కవి కె.వి రాజారావును, నాటక రంగంలో చేస్తున్న కృషికి గానూ జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవాధ్యక్షులు బొడ్డేపల్లి జనార్ధనరావును సత్కరించారు. కార్యక్రమంలో నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ జిల్లా కోఆర్డినేటర్‌ పూజారి గోవిందరావు, జెవివి జిల్లా కోశాధికారి వి.ఎస్‌ కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు సామ సంజీవరావు, జిల్లా కార్యదర్శి ఆర్‌.సురేష్‌బాబు, జిల్లా సైన్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ కన్వీనర్‌ హనుమంతు మన్మథరావు, పర్యావరణ కమిటీ జిల్లా కన్వీనర్‌ ఎ.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️