మండపేటలో గాలివాన..

Mar 20,2024 16:35 #Heavy rain, #Konaseema
  • అకాల వర్షంతో రైతులు ఆందోళన

ప్రజాశక్తి-మండపేట(కోనసీమ) : మండపేట పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం గాలి వాన కురిసింది. గత కొద్ది రోజులు నుంచి ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలు వర్షంతో సేదతీరారు. అయితే కొద్ది రోజుల్లో పంట చేతికి రామన్న నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా వర్షం కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వర్షం మరింతగా కురిస్తే పంట దిగుబడి తగ్గిపోవడంతో పాటు రైతులు నష్టపోయే అవకాశంలో ఉన్నాయని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా మండలంలో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాహశీల్దార్ సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

➡️