కూటమి అభ్యర్థులను గెలిపించండి : టిడిపి నాయకులు ఆర్‌ జె.వెంకటేష్‌

Apr 17,2024 12:08 #alliance candidates, #TDP leaders, #win

ప్రజాశక్తి-నిమ్మనపల్లి (అన్నమయ్య) : తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్‌ భాష, రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్‌ కుమార్‌ రెడ్డి లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్‌.జె వెంకటేష్‌ అన్నారు. మంగళవారం రాత్రి ముష్టూరు గ్రామం వలసపల్లెలో మాజీ సర్పంచు రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ”జయహౌ బీసీ” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … బీసీల అభివఅద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని వివరించారు. బ్యాక్వర్డ్‌ క్లాస్‌ గా ఉన్న బీసీలను బ్యాక్‌ బోన్‌ గా మార్చింది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి సమాజంలో బీసీలను ఉన్నత స్థానంలో నిలిపిందన్నారు. అందుకు భిన్నంగా నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తెలుగుదేశం హయాంలో ఉన్న ఆదరణ పథకం రద్దు చేయడం ద్వారా బీసీలకు అన్యాయం చేశారని, తెలుగుదేశం పార్టీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే నేడు దానిని తగ్గించి బీసీలకు అన్యాయం చేయడం ద్వారా స్థానిక సంస్థలలో 6 వేలు పదవులు కోల్పోయారని తెలిపారు. జగన్మోహన్‌ రెడ్డి పరిపాలనలో బీసీలపైన, దళితులపైన అనేక దౌర్జన్యాలు జరిగాయని, ఇలాంటి అరాచక పాలనకు ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు. గతంలో ఒక ట్రాక్టర్‌ లోడ్‌ ఇసుక 1000 రూపాయలు ఉంటే నేడు అదే లోడు ఇసుక 5000 రూపాయలకు చేరిందన్నారు. మద్యం ఏరులై పారుతోందని, నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని, పార్టీ నిర్ణయించిన ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్‌ భాషను గెలిపించడం మనందరి బాధ్యత అన్నారు. చంద్రబాబు నాయుడు ను మరోసారి ముఖ్యమంత్రిగా ప్రజలు చూడాలని ఎంతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. అనుభవం ఉన్న షాజహాన్‌ భాష ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పైన పోరాటంలో ముందు వరుసలో ఉంటాడని అటువంటి షాజహాన్‌ భాషకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. అదేవిధంగా రాజంపేట పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కి ఓటు వేసి ఆదరించాలని తెలిపారు. గతంలో ముఖ్యమంత్రిగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఎంతో అభివఅద్ధి చేశాడని, అటువంటి వ్యక్తిని అభివఅద్ధి కోసం మరల మనం గెలిపించుకోవటం అతి ముఖ్యమన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్ర అభివఅద్ధి కోసం ఎంతో త్యాగం చేశారన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ రాష్ట్రం అభివఅద్ధి చెందాలని కోరుకుంటూ ఓటు చీలకుండా తన వంతు ప్రయత్నంలో భాగంగా టిడిపి, జనసేన, బిజెపి పార్టీల కూటమిని ఏర్పాటు చేశాడని అన్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట బీసీ మహిళా ప్రధాన కార్యదర్శి విజయమ్మ, మాజీ మండలాధ్యక్షులు రాజన్న, మేష రామకఅష్ణ, మల్లికార్జున, శ్రీపతి, మాజీ సర్పంచ్‌ రమణ, జగదీష్‌, సుధాకర, మాజీ సర్పంచ్‌ రఫీ, జనసేన యువ నాయకులు అఫ్రోజ్‌ ఖాన్‌, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

➡️