నిరంతరం ప్రజల కొరకు పోరాడే సిపిఎంను గెలిపించండి

Mar 23,2024 15:43 #Kurnool

నిరంకుశ వైసీపీని, అవకాశవాద టిడిపి, జనసేన, బిజెపి లను ఓడించండి 

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూల్ న్యూ సిటీ ఆల్ యూనియన్స్ సిఐటియు నగర ఆఫీస్ బేరర్స్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు నగర అధ్యక్షులు ఆర్. నరసింహులు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శిఎం.డి.అంజిబాబు, జిల్లా అధ్యక్షులు పి. ఎస్.రాధాకృష్ణ, సిఐటియునగరకార్యదర్శిసి.హెచ్.సాయి బాబా, సిపిఎం పార్టీ నగర కార్యదర్శిటి.రాముడు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎం.డి ఆనంద్ బాబు గార్లు సమావేశానికి విచ్చేసిన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంకార్మికులహక్కులను హరించే విధంగా కార్మికులకు ఉన్న 44 లేబర్ కోడ్లను కుదించి నాలుగు కోడ్లుగా చేసి యజమానులకు అనుకూలంగా చట్టాలను చేస్తున్నది. కార్మికుల సంక్షేమం గురించి పక్కనపెట్టి కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయలను సబ్సిడీని ఇస్తూ దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నది. ప్రభుత్వరంగాలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తున్నది. అన్నదమ్ముల వలె కలిసి ఉన్న భారతదేశ ప్రజలను కులం పేరుతో మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతూ ఐక్యంగా ఉన్నప్రజలను విచ్ఛిన్నం చేస్తున్నది. ప్రపంచ దేశాల కంటే ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసి మనువాద సిద్ధాంతాన్నితీసుకురావాలని చూస్తున్నది. ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే ప్రజలను ఆదుకోకుండా ప్రజల పైన భారాలు వేయడమే పనిగా పెట్టుకుని నిత్యవసర ధరలు విపరీతంగాపెంచి,పెట్రోలు,డీజిల్,గ్యాస్, కరెంటు చార్జీలు,ఇంటి పన్ను లు,చెత్త పన్ను, రైల్వే చార్జీలు, మొదలగు భారాలు వేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నది. బిజెపి చేస్తున్న ప్రజావ్యతిరేక చట్టాలకు మద్దతుగా పార్లమెంటులో వైసిపి, టిడిపి ఎంపీలు బిజెపికి అనుకూలంగా ఓట్లు వేస్తున్నారు. ఆ విధంగా ఓట్లు వేయడం ద్వారా ప్రజా వ్యతిరేక చట్టాలు పార్లమెంటు నుండి బయటికి వస్తున్నాయి. ఈ విధంగా ప్రజలకు వ్యతిరేకంగాచేస్తున్నబిజెపిని, దానిని బలపరుస్తున్ననిరంకుశ వైసిపి, అవకాశవాద టిడిపి,జనసేన పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని, నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడుతున్న సిపిఎం పార్టీని గెలిపించాలని, కర్నూల్ నగరం బాగా అభివృద్ధి చెందాలంటే, ప్రజలకు మెరుగైన సేవలు అందాలంటే, కార్మికుల హక్కులు రక్షించబడాలంటే, సిపిఎం పార్టీ కర్నూల్లో గెలవడం ద్వారానే సాధ్యమవుతుందని సిపిఎం పార్టీ గెలుపులో కార్మిక వర్గం కీలక పాత్ర పోషించాలని, సిపిఎం అభ్యర్థి గెలుపుకు ఆర్థిక సహకారంచేస్తూ, ప్రజలను చైతన్యం చేసి సిపిఎం పార్టీని గెలిపించాలని వారు కోరారు. ఈ సమావేశంలో సిఐటియు ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్, సిఐటియు చిన్న వ్యాపారస్తుల సంఘం సిటీ కార్యదర్శి ఎస్.ఎం.డి.రఫీ, భవన నిర్మాణ కార్మిక సంఘం నగర నాయకులు జి.ఏసు, మధు, సంజీవ, మోహన్, మళ్లీ, మిన్నలా రామచంద్రుడు, నాగన్న, మొదలగు వారు పాల్గొన్నారు.

➡️