AP ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఎప్పుడంటే ?

అమరావతి : మే 24 నుండి జూన 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలుంటాయని ఎపి ఇంటర్‌ బోర్డు అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని ఇంటర్‌ బోర్డు ఆఫీసులో బోర్డు కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ ఇంటర్‌ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను ఒకే సమయంలో విడుదల చేశారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు http://resultsbie.ap.gov.inలో చెక్‌ చేసుకోవచ్చునని తెలిపారు. ఫలితాల అనంతరం సప్లిమెంటరీ పరీక్షా తేదీలను కూడా ఇంటర్‌ బోర్డు అధికారులు ప్రకటించారు. మే 24వ తేదీ నుంచి జూన్‌ 1వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయని ప్రకటించారు. కాగా, ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌లో, సెకండ్‌ ఇయర్‌లో కృష్ణా జిల్లా అగ్రస్థానం దక్కించుకున్నది. సెకండ్‌ ప్లేస్‌లో గుంటూరు, థర్డ్‌ ప్లేస్‌లో ఎన్టీఆర్‌ జిల్లా ఉన్నాయి.

➡️