సీనియరు ఓటర్లకు ఘనసన్మానం 

Jan 25,2024 12:55 #Annamayya district
voters day in b.kottakota

ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

ప్రజాశక్తి – బి కొత్తకోట : 14వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని బి.కొత్తకోట మండలంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. అన్ని మండల కార్యాలయాల్లో మరియు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో శక్తివంతమైందన్నారు. మండలంలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క యువతీ, యువకుడు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. అదేవిధంగా ఓటు హక్కును ఎన్నికల్లో స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు.అనంతరం సీనియర్ ఓటర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రఫీఅహ్మద్, కమిషనర్ పి.ఆర్ మనోహర్, మండల విద్యాశాఖ అధికారి రెడ్డి శేఖర్, నగర పంచాయతీ ఆర్.ఐ శ్రీనివాసులు, ఏఎస్ఐ బొజ్జ నాయక్, ఆర్.ఐ బాలాజీ, కానిస్టేబుల్ శేఖర్, నగర పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

➡️