బాధితులను ఆదుకోవాలి : సిపిఎం

Dec 7,2023 00:32

ప్రజాశక్తి – రేపల్లె
పునరావస కేంద్రాల్లోని కుటుంబాలకు రూ.2500, ఇళ్లల్లోకి నీళ్లు చేరిన బాధితులకు రూ.10వేలు ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఇచ్చి ఇళ్లు కోల్పోయిన వారికి పక్కా ఇళ్ళు నిర్మాణం చేయాలని సీపీఎం కార్యదర్శి సిహెచ్ మణిలాల్ డిమాండ్ చేశారు. మండలంంలోని పెనమూడి పునరావస కేంద్రాలను, పట్టణంలోని 20వ వార్డు ఐబీపీ పెట్రోల్ బంక్ వెనకాల 60ఇళ్ళను పరిశీలించారు. పునరావస కేంద్రానికి రాకుండా కొన్ని కుటుంబాలు ఇళ్ల దగ్గర తల దాచుకున్నారని, వారి పేర్లను కూడా జాబితాలో చేర్చాలని కోరారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లను గుర్తించాలని కోరారు. వార్డులో నీట మునిగిన 60ఇల్ల ప్రజలు సొంతంగా నీళ్లు తోడించుకున్నారని తెలిపారు. నష్టపోయిన వారందరినీ నిష్పక్షపాతంగా గుర్తించి ఈ కార్యక్రమంలో సిపిఎం రేపల్లె నాయకులు కె.ఆశీర్వాదం, కే.రమేష్, జి.దానియేలు, డి.శ్రీనివాసరావు, అగస్టిన్ తదితరులు పాల్గొన్నారు.

➡️