మైనర్‌పై అత్యాచారం కేసులో యుపి బిజెపి ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు

Dec 16,2023 09:29 #25, #BJP, #Jail, #minors, #MLA, #rape case, #up, #years

లక్నో: మైనర్‌పై అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే రాందులార్‌ గోండ్‌కు జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించింది. జరిమానాను బాధితురాలికి అందజేయాలని సోనెభద్ర అదనపు సెషన్స్‌ కోర్టు ఆదేశించింది. ఈ నెల 12న ఆయనను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది. దీంతో, ఆయన శాసన సభ సభ్యత్వం కూడా ఊడిపోతుంది. ప్రస్తుత బిజెపి ఎమ్మెల్యే, అప్పటి గ్రామ సర్పంచ్‌ భర్త రాందులార్‌ గోండ్‌ తనపై ఏడాదిగా లైంగిక దాడులకు పాల్పడినట్లు 15 ఏళ్ల బాలిక తొమ్మిదేళ్ల కిందట ఫిర్యాదు చేసింది. బాధితురాలి సోదరుడి ఫిర్యాదుతో 2014 నవంబర్‌ 4న రాందులార ్‌పై ఐపిసితోపాటు పోక్సో చట్టం సెక్షన్ల కింద పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. 2018లో బిజెపిలో చేరిన రాందులార్‌ 2022లో దుద్ది నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ కేసుపై విచారణ ముగించిన కోర్టు ఎమ్మెల్యే రాందులార్‌ను దోషిగా నిర్ధారించింది.

➡️