లేపాక్షి దేవాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి దేవన్ష్‌ సింగ్‌ చౌహాన్‌

Dec 24,2023 12:42 #feature

లేపాక్షి (అనంతపురం) : లేపాక్షి మండల కేంద్రంలోని ప్రపంచం ప్రసిద్ధి గాంచిన ఏక శిలా నంది, దుర్గా వీరభద్ర పాపానసేశ్వర ఆలయంను ఆదివారం కేంద్ర టెలీ కమ్యూనికేషన్‌ సహాయ శాఖ మంత్రి దేవాన్ష్‌ సింగ్‌ చౌహన్‌ సందర్శించారు. ఆలయ అర్చకులు ఆలయ విశిష్టతను తెలియజేసి విశేష పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందచేశారు. ఆ తరువాత మండల కేంద్రంలోని ఒరింటల్‌ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పాల్గన్నారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకంలపైన ఏర్పాటు చేసిన స్టాల్‌ ను చూశారు. అందులో భాగంగా అంగన్వాడీ కేంద్రంల ద్వారా గర్భిణీ స్త్రీ లకు, పిల్లలకు, బాలింతలకు అందిస్తున్న పోషకాహర స్టాల్‌, ఆధార్‌ సెంటర్‌, పక్కా గృహాల నమూనా, వైద్య సేవలు గురించి ఆయుర్వేదిక్‌ స్టాల్‌, ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్స్‌లు, ఉపాధిహామీ పథకం లో ప్రజలకు అందిస్తున్న సేవలు స్టాల్‌, పోస్టల్‌, బిఎస్‌యన్‌ యల్‌ అందిస్తున్న పథకం ల స్టాల్‌ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ … కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారని అన్నారు. గ్యాస్‌ కనెక్షన్‌ లను ఉచితంగా అందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రజల కు రైతులకు పీఎం కిసాన్‌ ద్వారా రైతులకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. ఎరువులు అందిస్తున్నామన్నారు అని అన్నారు. భారతదేశంలో గ్రామాలలో అభివఅద్ధి జరిగినప్పుడే దేశం అభివఅద్ధి జరుగుతుందని ప్రధానమంత్రి ముఖ్య ఉద్యేశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ భరత్‌ కుమార్‌, డిప్యుటీ తహశీల్దార్‌ కుమార్‌ రెడ్డి, ఎంపీడీఓ నరసింహ నాయుడు, ఈ ఓ ఆర్‌ డి శివన్న, యమ్‌ఈఓ నాగరాజు నాయక్‌, వెలుగు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️