రెండు జిల్లాల్లో స్కూళ్లకు రెండు రోజులు సెలవులు

Dec 3,2023 15:09 #heavy rains, #schools

ప్రజాశక్తి-అమరావతి : ‘మిచౌంగ్‌’ తుఫాన్‌ ప్రభావం నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అందుకే ఈ రెండు జిల్లాల్లో స్కూళ్లకు రెండు రోజుల (సోమవారం, మంగళవారం) పాటూ సెలవులు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలోని తీరప్రాంత మండలాలైన ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, జరుగుమల్లి, టంగుటూరు, సింగరాయకొండలో ముందస్తుగా సహాయక చర్యలను అధికార యంత్రాంగం చేపట్టింది. నెల్లూరు జిల్లాలో తీరప్రాంతాలైన కావలి, అల్లూరు, దగదర్తి, విడవలూరు, ఇందుకూరుపేట, ముత్తుకూరుల్లో ముందస్తు సహాయక ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరిపారు. రెండు జిల్లాల్లో ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కొనేందుకు మండలానికో ప్రత్యేక అధికారిని నియమించారు.

➡️