టిటిడి ఏప్రిల్ టికెట్ల కోటా విడుదల

Jan 24,2024 12:14 #online tickets, #release, #ttd

ప్రజాశక్తి-తిరుమల :  తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ఏప్రిల్ నెల దర్శనం టికెట్లు, వసతి గదుల కోటాను, అంగప్రదక్షిణ టోకెన్లను విడుదల చేసింది. సీనియర్ సిటిజన్లు, వికలాంగుల కోటా టికెట్లను ఈరోజు మధ్యాహ్నానికి విడుదల చేయగా.. రూ. 300 ప్రత్యేక దర్శనం టోకెన్లను ఉదయం 10 గంటలకే రిలీజ్ చేశారు. ఈ మేరకు భక్తులు ttdevasthanams.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు.

➡️