చెట్లను సంరక్షించాలి

Jan 1,2024 00:37

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్
మొక్కల పరిరక్షణ సంవత్సరం నినాదంతో ముందుకు సాగుదామని విద్యా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులు వృక్షాకారంలో నిల్చుని నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. చెట్లను సంరక్షించాల్సిన అవసరాన్ని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని హెచ్‌ఎం పిడపర్తి పేరిరెడ్డి కోరారు. మొక్కలు నాటి, వాటి పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రద్ధతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని కోరారు. విద్యార్ధి దశనుండే పొదుపు అలవాటు చేసుకోవడం మంచిదని అన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు చైతన్యం కలిగించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల నేషనల్ గ్రీన్ కోర్ విద్యార్థులు, నేషనల్ క్యాడెట్ కోర్ విద్యార్థులు, స్టూడెంట్ పోలీస్ కాడేట్ విద్యార్థులు, పర్వతనేని పావని, భవనం శివలీల, బండారు అనిల్ కుమార్, పెంట్యాల పావని, వసంత రఘు బాబు, సిహెచ్ శ్రీవిద్య, లక్ష్మి,పెండ్యాల రాధిక, వరికల్లు బ్రహ్మయ్య, అంబటి అపర్ణ, కంభాలపాటి నరసయ్య పాల్గొన్నారు.

➡️