టాప్‌ బిలియనర్ల విద్యార్హతలు

Feb 13,2024 13:33

ప్రపంచంలోని ప్రముఖ బిలియనీర్లుగా బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌, ఎలొన్‌మస్క్‌, మెటా సిఇబో జూకర్‌బర్గ్‌, అమెజాన్‌ కంపెనీ సిఇబో జెఫ్‌ బోజోస్‌లు పేరుగాంచారు. వీరు ఏ యూనివర్సిటీ నుంచి.. ఏం చదువుకున్నారో తెలుసుకుందామా..!

బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌

ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌. ఇతను లగ్జరీ బ్రాండ్‌ ఎల్‌విఎంహెచ్‌ వ్యవస్థాపకుడు. బ్రిటానికా ప్రకారం.. ఆర్నాల్ట్‌ పారిస్‌లోని ఎకోల్‌ పాలిటెక్నిక్‌ నుండి ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు.

ఎలొన్‌ మస్క్‌

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఎలొన్‌ మస్క్‌ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్‌. ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశాడు.

జెఫ్‌ బెజోస్‌

అమెజాన్‌ సిఇఓ జెఫ్‌ బెజోస్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ మరియు కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ చేశారు. ఈయన ప్రిన్సటన్‌ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్‌.

లారీ ఎల్లిసన్‌

ఈయన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ‘ఒరాకిల్‌’లో చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌. ఇతను ప్రపంచంలోని అగ్రశ్రేణి బిలియనీర్లలో ఒకరు. ఇతను డ్రాపౌట్‌ స్టూడెంట్‌. ఇల్లినాయిస్‌ విశ్వవిద్యాలయం, చికాగో యూనివర్సిటీ నుండి చదువుకోవాలనుకున్నా.. మధ్యలోనే చదువుని ఆపేశాడు. వివిధ క్లయింట్‌ల కోసం కంప్యూటర్‌ కోడ్‌లను రాయడానికి సుమారు పది సంవత్సరాలు వెచ్చించాడు.

జూకర్‌ బర్గ్‌

ఫేస్‌బుక్‌ (మెటా) సిఇఓ.. హార్వార్డ్‌ యూనివర్సిటీ నుండి డ్రాపౌట్‌గా ఉన్నాడు. ఈ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం సైకాలజీ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివాడు. రెండో సంవత్సరంలో కోర్స్‌మ్యాక్‌ ప్రోగ్రామ్‌ని కనిపెట్టాడు. ఈ ప్రోగ్రామింగ్‌ స్టూడెంట్స్‌కి బాగా ఉపయోగపడింది.

➡️