రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి

Dec 8,2023 22:50

ప్రజాశక్తి – మార్టూరు రూరల్
చేతికందే దశలో ఉన్న పంటలు తుఫాను వర్షాలు, పెనుగాలి చుట్టేయడంతో చేనులోనే గుండె ఆగి మృతి చెందిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు బత్తుల హనుమంతరావు డిమాండ్ చేశారు. మండలంలోని తాటివారిపాలెంలో 12ఎకరాల శెనగ పంట నీటితో చెరువుగా మారడంతో గుండె ఆగి మృతి చెందిన రైతు గన్నవరపు మస్తానరావు కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు. ఎకరా రూ.25వేల చొప్పున 11ఎకరాలు కౌలుకు తీసుకొని తనకున్న సొంత పొలం ఎకరంతో కలిపి 12ఎకరాలు శెనగ పంట సాగు చేశాడని తెలిపారు. రైతు మస్తానరావు గుండె పోటుతో మృతి చెందడం బాధాకరమని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తహశీల్దారు సుజాతకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్సులు పాలేపు సాంబయ్య, వీరవల్లి కృష్ణమూర్తి, పేర్ని నాగేశ్వరరావు, శేషాద్రి, వీరయ్య, బొడెంపూడి సూరిబాబు పాల్గొన్నారు.

➡️