ట్రంప్‌ అనర్హత కేసులో జడ్జీలకు బెదిరింపులు

Dec 23,2023 11:10 #Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనర్హుడు అని కొలరాడో కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేసులో తీర్పు వెలువరించిన న్యాయమూర్తులకు పలువురి నుంచి బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం. అలాగే జడ్జీలకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో తీవ్రమైన పదజాలంతో కొందరు పోస్టులు పెడుతున్నారని అడ్వాన్స్‌డ్‌ డెమోక్రసీ అనే ప్రభుత్వేతర సంస్థ తెలిపింది. కొలరాడో కోర్టు తీర్పు వెలువరించినప్పటి నుంచి జడ్జీలకు వ్యతిరేకంగా పలువురు పోస్టులు పెడుతున్నారు, ఈ రకమైన వ్యాఖ్యలు ఆందోళనకరం. జడ్జీలకు, వారి కుటుంబ సభ్యులకు హాని తలపెట్టాలని రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని వెల్లడించింది.

➡️