ఏప్రిల్‌లో ‘మ్యాజిక్‌’ సినిమా విడుదల

Jan 29,2024 19:55 #New Movies Updates

గౌతమ్‌ తిన్ననూరి, అనిరుధ్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం మ్యాజిక్‌. గతేడాది కొత్తవారిని సినీరంగానికి పరిచయంచేస్తూ ‘మ్యాడ్‌’ సినిమాను తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో నలుగురు కొత్తతరం వారిని ప్రధాన పాత్రల్లో పరిచయం చేస్తూ ‘మ్యాజిక్‌’ సినిమాను నిర్మించబోతున్నారు. సెన్సిబుల్‌ టీనేజ్‌ డ్రామాతో ఈ సినిమా సిద్ధమవుతోంది. కాలేజ్‌ ఫెస్ట్‌ కోసం ఒక ఒరిజినల్‌ సాంగ్‌ను కంపోజింగ్‌ చేయటానికి నలుగురు టీనేజర్లు చేసే ప్రయత్నం చుట్టూ కథ తిరుగుతుంది. గిరీష్‌ గంగాధరన్‌ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రొడక్షన్‌ బాధ్యతలను అవినాష్‌ కొల్లా చూస్తున్నారు. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా నీరజ కోన వ్యవహరించారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందించారు. శ్రీకర స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుల చేస్తామని చిత్ర నిర్మాతలు ఇటీవల ప్రకటించారు.

➡️