శెనక్కాయలు కొనే వారేరి..?అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివిధర లేక కల్లాల్లో రాసులు వెలవెల మద్దతు ధర ప్రకటించని ప్రభుత్వం దళారులు నిర్ణయించిందే ధర

శెనక్కాయలు కొనే వారేరి..?అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివిధర లేక కల్లాల్లో రాసులు వెలవెల మద్దతు ధర ప్రకటించని ప్రభుత్వం దళారులు నిర్ణయించిందే ధర

శెనక్కాయలు కొనే వారేరి..?అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివిధర లేక కల్లాల్లో రాసులు వెలవెల మద్దతు ధర ప్రకటించని ప్రభుత్వం దళారులు నిర్ణయించిందే ధర ప్రజాశక్తి-శ్రీకాళహస్తి సాంప్రదాయ వాణిజ్య పంటల్లో వేరుశెనగ ఒకటి. పంటల సాగులో ఆధునిక, యాంత్రీకరణ పద్ధతులు కొత్త పుంతలు తొక్కుతున్నా శెనగ సాగు కత్తిమీద సాము లాంటిదే. విత్తు విత్తిన మొదలు కాయలు చేతికొచ్చి విక్రయించే వరకూ రైతు ఎంతో వ్యయ ప్రయాసలు పడాల్సిందే. తీరా కాయలకు మద్దతు ధర లభించని పరిస్థితుల్లో రైతు దిగాలు పడే పరిస్థితి ఏటా ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో శెనగ సాగుపై రైతులు క్రమేణా మక్కువ చూపడం మానేశారు. అయితే వ్యవ’సాయాన్ని’ వత్తిగా మార్చుకున్న కొందరు రైతులు శ్రమ అయినా శెనగ సాగుకు దిగుతున్నారు. ఈ ఏడు కూడా కొద్దో గొప్పో రైతులు వేరుశెనగ పంటలు సాగు చేశారు. అయితే కొనే నాధుడు లేకపోవడంతో ప్రభుత్వం వంక దిగాలుగా చూస్తున్నాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు శెనగ పంటకు(ఎంఎస్పీ) మద్దతు ధర ప్రకటించకపోవడంతో దళారులు రైతులను దగా చేసి అత్తెసర ధరకు కాయలను కొంటుండటం విచారకరం.ధర లేక కల్లాల్లో రాసులు వెలవెల జిల్లాకు ధాన్యాగారాలుగా పిలుచుకునే తూర్పు మండలాల్లో ఒకప్పుడు వరికి సమానంగా వేరుశెనగ పంట సాగయ్యేది. అయితే పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో శెనగ సాగు కష్టతరమైన నేపథ్యంలో కాలక్రమేనా రైతులు శెనగ సాగును వీడి ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గుచూపారు. ఫలితంగా వేరుశెనగ సాగు తూర్పు మండలాల్లో గణనీయంగా తగ్గిపోయింది. ఈ ఏడాది రబీలో శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ డివిజన్‌ పరిధిలో సుమారు 2 వేల ఎకరాల్లో వేరుశెనగ పంటను రైతులు సాగు చేశారు. డివిజన్‌ వ్యాప్తంగా దాదాపు శెనగ ఒబ్బిళ్లు పూర్తి అయ్యాయి. అయితే మద్దతు ధర లేకపోవడంతో అమ్ముకునే దారి లేక కాయలు కల్లాల్లోనే మగ్గుతున్న పరిస్థితి కనబడుతోంది.దళారులు నిర్ణయించిందే ధర!గతేడాది 40 కిలోల వేరుశెనక్కాయల బస్తా(నాణ్యతను బట్టి) రూ.3000 నుంచి రూ.3200 ధర పలికింది. మూడో గ్రేడ్‌ కాయలు కూడా కనీసం రూ.2900 వరకు ధర పలికాయి. అయితే ఈ ఏడాది గ్రేడ్‌-1 కాయలను రూ.3 వేలకు కూడా కొనని పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం 40కిలోల బస్తాకు దళారులు సిండికేట్‌ ఏర్పడి కేవలం రూ.2400 ధర నిర్ణయించినట్లు రైతులు వాపోతున్నారు. ఎకరా పొలంలో శెనగ పంట సాగు చెయ్యాలంటే సుమారు రూ.50 వేలకు పై మాటే పెట్టుబడి ఖర్చు అవుతోంది. దిగుబడి 30 బస్తాలు వేసుకున్నా ప్రస్తుత మద్దతు ధరతో పెట్టుబడి డబ్బు కూడా రాని పరిస్థితి నెలకొంటుందని రైతులు వాపోతున్నారు. ఒక పక్క అప్పులు.. మరో పక్క కల్లాల్లో కొనుగోలు కాని కాయలు..వెరసి రైతులు అరకొర ధరకే కాయలను తెగనమ్ముకోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేరుశెనగ పంటకు మద్దతు ధర ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ప్రభుత్వం ఆదుకోవాలి: మనోహర్‌, రైతు ఎకరా పొలంలో వేరుశెనగ పంట వేశా. రూ.50 వేలు పెట్టుబడి అయ్యింది. వానలు లేకపోవడంతో నీటి ఎద్దడి కారణంగా దిగుబడి కూడా తగ్గింది. తీరా ఫలితం వచ్చాక అమ్మబోతే అడవి..కొనబోతే కొరివి అన్న తీరుగా దళారులు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలి.

➡️