తండ్రి అయిన బుల్లితెర నటుడు అర్జున్‌

Jan 9,2024 16:05 #movie, #serial

హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్‌ అర్జున్‌ అంబటి తండ్రి అయ్యాడు. అర్జున్‌ భార్య సురేఖ ఈరోజు (జనవరి 9) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అర్జున్‌ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు. కుమార్తెకు అర్ఖా అని పేరు పెట్టారు. అర్జున్‌లోని ఆర్‌.. సురేఖ పేరులో నుంచి ఖ తీసుకుని అర్ఖా అని పేరు పెట్టుకోబోతున్నట్లు అర్జున్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో చెప్పాడు. దీంతో అర్జున్‌- సురేఖ దంపతులకు పలువురు సెలబ్రిటీలు అభిమానులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా, అర్జున్‌ మా టీవీలో ప్రాసరమైన దేవత సీరియల్‌లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే అగ్నిసాక్షి సీరియల్‌, ఇస్మార్ట్‌ జోడీ షోలో కూడా పాల్గొన్నారు. ఇక బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి ఎంటర్‌ అయిన అర్జున్‌ టాప్‌ 6 ప్లేస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. ప్రస్తుతం పలు షోలు, సీరియల్స్‌లో నటిస్తున్నారు.

➡️