ఆర్‌టిసిలో 541 అద్దె బస్సులకు టెండర్లు

Feb 17,2024 09:10 #APSRTC

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ఆర్‌టిసిలో 541 అద్దె బస్సులకు ఆర్‌టిసి యజమాన్యం టెండర్లను ఆహ్వానించింది. రెండు ఎసి స్లీపర్‌, తొమ్మిది నాన్‌ ఎసి స్లీపర్‌, 22 సూపర్‌ లగ్జరీ, 33 అల్ట్రా డీలక్స్‌, 168 ఎక్స్‌ప్రెస్‌, 74 అల్ట్రా పల్లెవెలుగు, 225 పల్లెవెలుగు, మూడు మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఐదు సిటీ ఆర్డనరీ బస్సులకు ఆర్‌టిసి టెండర్లను పిలిచింది. ఇందులో శ్రీకాకుళం జిల్లాకు 32 బస్సులు, విజయనగరం 7, పార్వతీపురం మన్యం 15, విశాఖపట్నం 3, అనకాపల్లికి 14, కాకినాడకు 18, తూర్పుగోదావరికి 18, అంబేద్కర్‌ కోనసీమకు 10, పశ్చిమ గోదావరికి 10, ఏలూరుకు 16, ఎన్‌టిఆర్‌ జిల్లాకు 24, కృష్ణా జిల్లాకు 15, గుంటూరుకు 54, పల్నాడుకు 36, బాపట్లకు 13, ప్రకాశం జిల్లాకు 16, నెల్లూరుకు 13, తిరుపతికి 32, అన్నమయ్య జిల్లాకు 40, వైఎస్సార్‌ కడప జిల్లాకు 24, కర్నూలుకు 8, నంద్యాల జిల్లాకు 20, అనంతపురం జిల్లాకు 39, సత్యసాయి జిల్లాకు 32 బస్సులు కలిపి మొత్తం 541 అద్దె బస్సులకు ఆర్‌టిసి టెండర్లను పిలించింది. ఎమ్‌ఎస్‌టిసి ఇ కామర్స్‌ పోర్టల్‌ ద్వారా టెండర్లలో పాల్గొనొచ్చని ఆర్‌టిసి తెలిపింది. ఈ నెల 21 నుంచి టెండర్ల ప్రక్రియ మొదలై మార్చి 6వ తేదీన ముగుస్తుందని పేర్కొంది. మార్చి 14న రివర్స్‌ టెండరింగ్‌లో పాల్గొనాల్సి వుంటుందని తెలిపింది.

➡️