గురువు

May 8,2024 04:18 #teacher

అక్షరాలు దిద్దిస్తున్నప్పుడు తెలియలేదు
నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని
కోపగించుకున్నప్పుడు తెలియలేదు
నాపై బాధ్యతను పెంచుతున్నారని
చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు
నా చేతికి భయం పెడుతున్నారని
ప్రశ్నలడిగినప్పుడు తెలియలేదు
ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని …
పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదు
నా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని
మార్కులస్తున్నప్పుడు తెలియలేదు
నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని
ఈ క్షణం తెలుస్తోంది
నాలో.. ఒక విశాల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని!

– జి.సుహాసిని, అల్లినగరం, ఎం.తిమ్మాపురం,
ఏపీ మోడల్‌ స్కూలు, నంద్యాల

➡️