సిఎన్‌జిపై పన్ను తగ్గింపు సంతోషకరం : ఎజిఅండ్‌పి సిఇఒ

Feb 26,2024 20:45 #Business, #Tax cut on CNG

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సిఎన్‌జి, పిఎన్‌జిలపై పన్ను తగ్గించడం పట్ల ఎజి అండ్‌ పి ప్రథమ్‌ సంతోషం వ్యక్తం చేసింది. ఈ సహజ వాయువులపై ఇంతక్రితం 24.5 శాతంగా ఉన్న వ్యాట్‌ను ఇప్పుడు 5 శాతానికి తగ్గించినందుకు సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి ఎజిఅండ్‌ఫి ఎండి, సిఇఒ అభిలేష్‌ గుప్తా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం సిఎన్‌జి కిలో ధర రూ.93గా ఉండగా.. ప్రభుత్వ నిర్ణయంతో వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి 79కి తగ్గనుందని పేర్కొంది.

➡️