ఎసిబికి చిక్కిన ఎస్‌ఐ నాగేశ్వరరావు

రూ.70 వేల లంచం తీసుకుంటూ.. పట్టుబడ్డ వైనం
ప్రజాశక్తి-టంగుటూరు (ప్రకాశం జిల్లా) :ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన ఎస్‌ఐ ఎ నాగేశ్వరరావు ఎసిబి వలకు చిక్కారు. రూ.70 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఎసిబి అధికారుల కథనం ప్రకారం..కాకుటూరువారిపాలెం గ్రామానికి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావు గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి అక్రమంగా బ్యారన్‌ నిర్మిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమణదారుడు అధికార పార్టీ నాయకుడు అవడంతో సంబంధిత బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీంతో గ్రామస్తులు ఎస్‌ఐను ఆశ్రయించి.. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఏదేమైనా అధికార పార్టీ నాయకుడు కావడంతో అక్రమంగా బ్యారన్‌ నిర్మిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటే రూ.లక్ష ఇవ్వాలని కొమ్మినేని శ్రీనివాసరావును ఎస్‌ఐ డిమాండ్‌ చేశారు. ఈ కేసు విషయంలో ఎస్‌ఐ నాగేశ్వరరావుకు రూ.70 వేలు లంచం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. లంచం సొమ్మును మంగళవారం టంగుటూరులోని ఎస్‌ఐ నివాసం ఉంటున్న చెల్లెమ్మ తోట వద్ద ఎస్‌ఐకు శ్రీనివాసరావు ఇస్తుండగా అక్కడే మాటు వేసిన ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్‌ఐపై కేసు నమోదు చేశారు.

ని

➡️