స్వామి సాధించాడు 

Mar 1,2024 12:46 #Chittoor District
Swami achieved

వివాదాలను జయించాడు.. టికెట్ కుమార్తెకు ఇప్పించుకున్నాడు..!
పార్టీ శ్రేణులు సంబరాలు
ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏటికేలకు ఖరారు అయింది. పార్టీ నాయకులు నారాయణస్వామికి టికెట్ అంటూ ప్రచారం చేశారు .అయితే పట్టుబట్టి నారాయణస్వామి కుమార్తెకు తన వారసురాలుగా నియోజవర్గానికి టికెట్ ఇప్పించుకొని పరిచయం చేస్తున్నాడు. సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ప్రస్తుతం గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు .మళ్లీ అవకాశం ఆయన కుమార్తె రూపంలో దక్కించుకున్నారు. అధిష్టానం ఈ మేరకు గత కుప్పం పర్యటనలో ఆయన వారసరాలుగా కృపా లక్ష్మిని అధికారికంగా ప్రకటించింది .కొంతకాలం కొనసాగిన ఊహాగానాలకు స్వస్తి పలికారు. ప్రస్తుతం ప్రజలకు పూర్తిగా అభ్యర్థి ఎవరనేది తెలిసింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వెదురుకుప్పం ,కార్వేటినగరం, శ్రీ రంగరాజపురం ,పాలసముద్రం గంగాధర నెల్లూరు, పెనుమూరు మండలాలు ఉన్నాయి. 2019 జనాభా లెక్కల ప్రకారం 1 లక్ష 936, మంది వాటర్లో ఉన్నారు. నాలుగో జాబితా చిత్తూరు సిటీ ఎంపీగా ఉన్న రెడ్డప్పను జీడీ నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమిస్తూ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామిని చిత్తూరు ఎంపీగా చేస్తూ అధిష్టానం గతంలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో తన అభ్యర్థిత్వానికి వ్యతిరేకిస్తూ మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డిని నారాయణస్వామి తిరుపతి విమానాశ్రయంలో కలిసి మాట్లాడారు. విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం గుర్తించి పార్టీ అధిష్టానం గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే తిరిగి పునర ఆలోచనలు పడింది. దీంతో డిప్యూటీ సీఎం నారాయణస్వామి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. చిత్తూరు ఎంపీగా రెడ్డిప్పను యధాతతంగా కొనసాగించాలని నిర్ణయించారు. వర్గ విభేధలు లేకుండా కలిసికట్టుగా వెళ్లాలని సూచించారు. అయితే జగన్మోహన్ రెడ్డి కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు నారాయణస్వామి ప్రయత్నాలు ఫలించాయి. తన వారసురాలుగా కృపా లక్ష్మికి టికెట్ ఇవ్వాలని నేరుగా జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు స్థానిక నాయకులు చెబుతున్నారు. ఈయన ఆదేశాలు మేరకు కృపా లక్ష్మి గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు వెలుపడ్డాయి. దీంతో పార్టీ శ్రేణులు నియోజకవర్గంలో సంబరాలు చేసుకుంటున్నారు.

➡️