భగత్ సింగ్ ఆశయాల కోసం పోరాటం

Jan 1,2024 00:28

ప్రజాశక్తి – బాపట్ల రూరల్
భగత్ సింగ్ ఆశయాల కోసం పోరాడుతామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆర్య అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పట్టణంలోని వివిధ కళాశాలల ముందు ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ జెండాలు ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఐ 1970 డిసెంబర్ 30, 31తేదీల్లో కేరళలో అధ్యయనం, పోరాటం నినాదంతో స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో తొలి మహాసభ నిర్వహించారని అన్నారు. గత 53ఏళ్లుగా దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేసిందని అన్నారు. ఎంతోమంది విద్యార్థులు తమ ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించారని అన్నారు. వారందరి ఆశయాల కోసం పని చేస్తామని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఎస్ఎఫ్ఐ పోరాటాలు మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి విద్యార్థులతో పాటు ప్రజలందరూ సహాయ, సహకారాలు అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ నూతన విద్యా విధానం 2020ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. విద్యా వ్యవస్థలో మూఢత్వాన్ని పెంచి పోషించేందుకు తీసుకువచ్చిన ఈ విధానం పేద విద్యార్థులకు శాపంగా మారిందని అన్నారు. నూతన విద్యా విధానం రద్దు కోసం జనవరి 12న చలో ఢిల్లీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎస్ఎఫ్ఐ 53ఏళ్ల త్యాగాలను స్మరించుకుంటూ భవిష్యత్తులో జిల్లాలో మరింతగా విద్యార్థుల సమస్యలపై పోరాడుతామని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, పిజి సెంటర్ ఏర్పాటుకై ఉద్యమాలు చేస్తామన్నారు. జీవో నెంబర్ 77రద్దు అయ్యే వరకు పోరాడుతామన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు భాను తేజ, సాదిక్, వెంకటేష్ పాల్గొన్నారు.

➡️