పొట్ట కొడుతున్న సభలు

Apr 10,2024 16:10 #Guntur District

ప్రజాశక్తి-చిలకలూరిపేట : ఎండలు తీవ్రత దెబ్బకు పనులు అంతంతం మాత్రంగానే ఉన్నాయని రోజు వారీ కూలీలు అంటున్నారు. దానికి తోడు సభలు, సమావేశాలంటూ బస్సులు లేకపోవటంతో ప్రతి పల్లె నుంచి చిలకలూరిపేటకు వచ్చి కూలి చేసుకునే వారికి వందల మంది పల్లె కూలీలకు ఆ రోజు కూలి పనులు లేకుండా పోయాయని వాపోతున్నారు. ఉదాహారణకు చిలకలూరిపేట నుంచి సూరవరపుపల్లె, అనంతవరం, యణమదల, యద్దనపూడి, గన్నవరం, పూనురు వరకు ప్రత్యేకంగా స్థానిక కళా మందిర్ సెంటర్ వద్ద గల పూనూరు వైపు వెళ్లే బస్ స్టాండ్ పాయిట్ వద్ద నుంచి నిత్యం మూడు బస్సులు తిరుగుతు ప్రయాణికులను వారి వారి గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. ఈ బస్సు సౌకర్యం ఉన్న ఆయా గ్రామాల నుంచి ఉదయం 6 గంటల బస్సు రోజు వారీ కూలీలను చిలకలూరిపేటకు తీసుకు రావటానికి సమయానకూలంగా ఉంటుంది. ఉదయం 6గంటలకు ప్రారంభమయ్యే ఈ బస్సులు పొర పాటున ఏదైనా అయితే ఇహ రోజు కూలీలకు పోయే వారికి వేరే అవకాశం లేక ఆరోజు కూలి వదులుకోవలసిన పరిస్థితి ఉంది. మోటారు సైకిల్ పై వెళ్లే కన్నా తక్కువ చార్జీలు కాబట్టి ఈ బస్సులోనే ప్రయాణం చేస్తున్నారు. అదే విధంగా సాయత్రం చిలకలూ రిపేట నుంచి ఈ గ్రామాలను కలుపుతూ పోయే బస్సు సౌకర్యముగా ఉండటంతో వారికి ప్రత్యయం ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది. అయిన ఎక్కడో సభలకు అక్కడి ప్రజలు అవసరం కానీ రాష్ట్ర ప్రజలు ఎందు కను కుంటున్నారు. ముఖ్యమంత్రి సభలకు బస్సులు వెళ్ళటం వల్ల చిలకలూరిపేట డిపో నుంచి కొప్పారు, ఫిరంగి పురం, వినుకొండ, ఇంకొల్లు,కుందుర్రు లాంటి గ్రామాలకు బుధవారం నాడు బస్సు సౌకర్యం లేదు.. చిలక లూరి పేట డిపో మేనేజర్ రాంబాబు మాట ల్లో డిపోలో మొత్తం 72బస్సులు ఉంటే వా టీల్లో 40బస్సులు అద్దె కిచ్చామన్నారు. వున్న బస్సులు గుంటూరు, నరసరావు పేట, చిలకలూరి పేట వైపు తిరుగు తున్నాయన్నారు. పై అధికారులు చెప్పినట్లు మేము చేస్తున్నా మన్నారు. కండక్టర్ మాటల్లో అద్దెకిచ్చిన ఈ 40 బస్సుల కండక్టర్ లకు సెలవులు ఇచ్చారని ఈ రోజు జీతం తగ్గిస్తారని అంటున్నారు.

➡️