క్రీడాకారులకు పతకాలు

Jan 14,2024 11:07 #Krishna district
sports persons award

ప్రజాశక్తి-హనుమాన్ జంక్షన్ : జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ క్రీడలో టైగర్ పవర్క్లబ్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి హనుమాన్ జంక్షకు పేరు తేవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. నేషనల్ కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో హనుమా నిజంక్షన్కు చెందిన టైగర్ పవర్ కిక్ బాక్సింగ్ అండ్ కరాటే స్కూల్ క్రీడాకారులు 11 పతకాలు సాధించి సత్తా చాటారు. ఈ నెల 3 నుం చి 6వ తేదీ వరకు ఢిల్లీలోని తల్కటోరా ఇం డోర్ స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన టైగర్ పవర్ కిక్ బాక్సింగ్ అండ్ కరాటే స్కూల్ క్రీడాకారులు సబ్ జూనియర్ విభాగంలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారని కోచ్ కట్టా సుధాకర్ వివరించారు. సబ్ జూని యర్స్ సెమీ కాంటాక్ట్ ఫైట్స్ కేటగిరిలో కట్టా మనోజ్, హారికా ధనలక్ష్మి సిల్వర్ మెడల్స్ సాధించారని చెప్పారు. జాతీయస్థాయిలో అత్యధిక పతకాలను సాధించి ఏపీ తరపున ప్రాతినిధ్యం వహించిన టైగర్ పవర్ కిక్ బాక్సింగ్ అండ్ కరాటే స్కూల్ విద్యార్థులను పలువురు పుర ప్రముఖులు అభినందించారు.

➡️