గ్రేవ్‌ కేసుల దర్యాఫ్తు వేగవంతం

పెండింగ్‌లో ఉన్న గ్రేవ్‌ కేసుల

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌పి రాధిక

  • ఎస్‌పి జి.ఆర్‌ రాధిక

ప్రజాశక్తి – శ్రీకాకుళం

పెండింగ్‌లో ఉన్న గ్రేవ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న గ్రేవ్‌, ప్రాపర్టీ, ఎస్‌సి, ఎస్‌టి, పోక్సో, ముఖ్యమైన కేసుల దర్యాఫ్తు, నేర నియంత్రణ తదితర అంశాలపై పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రేవ్‌ కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, నిందితులపై ఛార్జిషీట్‌ దాఖలు కోర్టులో చేయాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, పోక్సో కేసుల్లో పారదర్శకంగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పారు. ప్రాపర్టీ కేసుల్లో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, కేసులను త్వరితగతిన ఛేదించాలని ఆదేశించారు.ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలిఈనెల 18వ తేదీన ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ నిర్వహణకు పోలీసు అధికారులు తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. నామినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్‌ఐలు, సిఐలు సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి క్షేత్రస్థాయిలో స్వయంగా ఆయా గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకం కావాలన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద సిఐలు, డిఎస్‌పిలు ఆకస్మికంగా వాహనాలు తనిఖీలు చేపట్టాలన్నారు. నిఘా, సమాచార వ్యవస్థను పటిష్టపరిచి, వాహనాల తనిఖీలు ముమ్మరం చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎఎస్‌పి జి.ప్రేమ్‌ కాజల్‌, వి.ఉమామహేశ్వరరావు, డిఎస్‌పిలు డి.బాలచంద్రారెడ్డి, వై.శ్రుతి, బి.నాగేశ్వర్‌రెడ్డి, త్రినాథరావు, శ్రీనివాసరావు, విజరుకుమార్‌, ఎల్‌.శేషాద్రి నాయడు, పోలీసు లీగల్‌ అడ్వైజర్‌ యామనిరాణి, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

➡️