అపార్ట్‌మెంట్‌ వాసుల సమస్యలను పరిష్కరించండి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌ బాబురావు

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌ (విజయవాడ) : పాయికాపురం రాధానగర్‌ సెవెన్‌ అపార్ట్‌మెంట్‌లోని పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం స్థానికులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌ బాబురావు మాట్లాడుతూ … ప్రభుత్వం ఇచ్చిన అపార్ట్‌మెంట్‌లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, తాగటానికి మంచి నీళ్లు లేవనీ, వాడుకోటానికి బోరు నీళ్ళు లేవనీ, డ్రైనేజీ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అపార్ట్‌మెంట్‌లో పగిలిపోయిన పైపులు రిపేరు చేయాలని వాటర్‌ ట్యాంకులు పగిలిపోయి ఉండటంతో నీరు వఅధాగా పోతుందని, నీళ్లు కలుషితం అవుతున్నాయని దానివలన అనేక సమస్యలు వస్తున్నాయని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటం వలన కాలనీలో దుర్వాసన వస్తుందని, పైపులు రిపేరు చేయాలని కోరారు. మంచినీళ్లు రాకపోవటం వలన మూడో అంతస్తులో ఉన్నవారికి ఒక్క బిందెడు నీళ్లు కూడా దొరకడం లేదని పైకి వెళ్లి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాలనీలో బోరు వేయించాలని, వాడుకోవడం కోసం నీళ్లు ఇవ్వాలని, పగిలిపోయిన పైపులైను తిరిగి ప్రభుత్వ నిధులతో వేయించాలని కోరారు. గతంలో అపార్ట్‌మెంట్‌లో రిజిస్ట్రేషన్‌ కోసం 60,000 రూపాయలు పైనే వసూలు చేశారని చెప్పారు. చెత్త పన్ను, నీటి పన్ను… ఈ విధంగా అపార్ట్‌మెంట్‌లో కరెంట్‌ బిల్లు అధికంగా వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన అపార్ట్‌మెంట్‌లోని నిరుపేద కుటుంబాలు చెందినవారిపై అనేక భారాలు వేయటం సమంజసం కాదన్నారు. మంచినీళ్లు లేకపోవడంతో బోరు నీళ్లు తాగవలసి వస్తుందని దానివలన విపరీతమైన దురదలు స్కిన్‌ ఎనర్జీ వస్తుందని అనారోగ్య పాలవుతున్నామని అక్కడి మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన ప్రభుత్వం స్పందించాలని అపార్ట్‌మెంట్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే త్వరలో రాజీవ్‌ నగర్‌, కండ్రిక, రాజరాజేశ్వరి పేట, సింగ్‌ నగర్‌, కాలనీవాసులతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని సిహెచ్‌ బాబురావు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సిటీ కార్యదర్శి బి రామారావు, సెంట్రల్‌ సిటీ అధ్యక్షులు కే దుర్గారావు, ఐద్వా రాష్ట్ర కమిటీ కార్యదర్శి శ్రీదేవి, డివైఎఫ్‌ఐ 63వ డివిజన్‌ కార్యదర్శి ఎం డి రఫీ, సిపిఎం నాయకులు నాగేశ్వరావు, నాగరాజు, జి అరుణ, వెంకటమ్మ, సత్య, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

➡️